Share News

Breaking News: హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - Mar 19 , 2025 | 09:39 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
TG Budget

Live News & Update

  • 2025-03-19T21:29:32+05:30

    మరోసారి హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

    • హైడ్రా టార్గెట్‌ పేద, మధ్య తరగతి మాత్రమేనా అన్న హైకోర్టు

    • ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా?

    • మియాపూర్‌, దుర్గం చెరువు ఆక్రమణ పరిస్థితి ఏంటీ?

    • అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అన్న హైకోర్టు

    • హైడ్రా పనితీరు అశాజనకంగా లేదన్న ఉన్నత న్యాయస్థానం

    • ‘మీరాలం’పై ఉమ్మడి సర్వే చేపట్టాలని ఆదేశం

    • తహసీల్దార్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ హైకోర్టుకు ఫాతిమా అనే మహిళ

    • విచారణ సందర్భంగా హైడ్రాపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

  • 2025-03-19T20:58:00+05:30

    హైదరాబాద్‌: కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంపు

    • తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి..

    • మద్యం, బీరు కంపెనీలు కొత్త ఉత్పత్తులను సప్లయి చేయడానికి..

    • మార్చి 15 వరకు గడువు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ

    • ఇప్పటి వరకు టీజీబీసీఎల్‌కు కొత్త కంపెనీల నుంచి 39 దరఖాస్తులు

    • ఏప్రిల్‌ 2 వరకు గడువు పెంపు

  • 2025-03-19T17:50:04+05:30

    ఏపీ ప్రజలకు పెద్ద శుభవార్త..

    • అమరావతి: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ కోసం నిధులు మంజూరు చేసిన కేంద్రం.

    • రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటిపోవడంతో తిరిగి మరోసారి ప్లాన్ రూపొందించాలని కోరిన సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం.

    • కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్లు ద్వారా ఎంపిక చేసిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.

    • రెండు నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్ర ఎంవీఏ సంస్థ ఎంపిక.

    • విశాఖలో రూ. 84.47 లక్షలు, విజయవాడలో రూ. 81.68 లక్షలతో ప్లాన్ రూపొందించనున్న సంస్థ.

    • ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేసిన సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం.

  • 2025-03-19T13:51:10+05:30

    బడ్జెట్‌పై బీజేపీ రియాక్షన్

    • బడ్జెట్‌పై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యేలు

    • ఏబీఎన్ తో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు

    • ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ బోగస్

    • గతంలో ముఖ్య మంత్రి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి క్యాన్సర్ పట్టుకుందన్నారు

    • దానికి అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన చేశారు

    • అంకెల గారడీని కేసీఆర్‌ని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకున్నారు

    • కేసీఆర్ అధికారంలో ఉండగా బడ్జెట్ లో చెప్పిన దాంట్లో పది శాతం ఖర్చు చేయలేదు

    • గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు బడ్జెట్ లో నిధులు పెట్టి రూపాయి ఖర్చు చేయలేదు

    • ప్రస్తుతం కాంగ్రెస్ ఒక్క కార్పొరేషన్‌కి రూపాయి కేటాయించలేదు

    • ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు వెళితే బయటకు నెట్టేస్తున్నారు

    • అంకెల గారడీని ఆపి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్ రెడ్డికి మంచిది

  • 2025-03-19T12:20:12+05:30

    బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా

    • ఎస్సీ సంక్షేమానికి : రూ.40,232 కోట్లు

    • ఎస్టి సంక్షేమానికి : రూ.17,169 కోట్లు

    • బీసీ సంక్షేమానికి : రూ.11,405 కోట్లు

    • మైనార్టీ సంక్షేమానికి : రూ.3,591 కోట్లు కేటాయింపు

    • ఐటీ శాఖకు : రూ.7,704 కోట్లు

    • వైద్య ఆరోగ్యశాఖకు : రూ.12,393 కోట్లు

    • విద్యుత్ శాఖకు : రూ. 21,221 కోట్లు

    • H సిటి డెవలప్మెంట్ కి : రూ.150 కోట్లు

    • MA & UD శాఖకు : రూ.17,677 కోట్లు

    • నీటి పారుదుల శాఖకు : రూ.23,373 కోట్లు

    • రోడ్లు భవనాల శాఖకు : రూ.5,907 కోట్లు

    • పర్యాటకశాఖ కు : రూ.775 కోట్లు

    • క్రీడా శాఖకు : రూ.465 కోట్లు

    • ఫారెస్ట్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ : రూ.1,023 కోట్లు

    • దేవాదాయశాఖ కు : రూ.190 కోట్లు

    • హోంశాఖ కు : రూ.10,188 కోట్లు

  • 2025-03-19T12:14:14+05:30

    కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన బీజేపీ శ్రేణులు

    • గజ్వేల్ ఎమ్మెల్యే కనబడటం లేదని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయన్ని ముట్టడించిన బిజేపీ నాయకులు

    • ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేటుకు టూలెట్, వాంటెడ్ బోర్డులను అతికించి నిరసన

    • గజ్వేల్ ప్రజలు గుర్తున్నారా కేసిఆర్ అంటూ నిరసన తెలిపిన గజ్వేల్ బిజెపి శ్రేణులు

  • 2025-03-19T11:42:26+05:30

    తెలంగాణ బడ్జెట్‌లో అంకెలు

    • తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ : రూ.3,04,965 కోట్లు

    • రెవెన్యూ వ్యయం : రూ. 2,26,982 కోట్లు

    • మూలధన వ్యయం : రూ. 36,504 కోట్లు

    • రైతు భరోసా కోసం : రూ. 18వేల కోట్లు

    • వ్యవసాయ శాఖ : రూ. 24,439 కోట్లు

    • పశు సంవర్డక శాఖ : రూ. 1,674

    • సివిల్ సప్లై : రూ. 5,734 కోట్లు

    • విద్యా శాఖ : రూ. 23,108 కోట్లు

    • కార్మిక ఉపాధి కల్పన : రూ. 900 కోట్లు

    • పంచాయతీ రాజ్ శాఖ : రూ. 31,605 కోట్లు

    • మహిళా శిశు సంక్షేమ శాఖ : రూ. 2862 కోట్లు

  • 2025-03-19T11:17:13+05:30

    బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క

    • తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం

    • ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం

    • విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నాం

    • రైతుల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది

    • నీకు కనిపించిన బలహీనులైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో.. నువ్వు తీసుకున్న చర్య అతడికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో అన్న మహత్మా గాంధీ మాటలను గుర్తుచేసిన భట్టి విక్రమార్క

    • గాంధీ మాటలను పాటిస్తూ ముందుకెళ్తున్నాం.

  • 2025-03-19T11:11:42+05:30

    ప్రజా ప్రయోజనాలే థ్యేయంగా పనిచేస్తున్నామన్న భట్టి

    • ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది

    • జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన అందించడంలో సఫలీకృతమయ్యామని భావిస్తున్నాం

    • తెలంగాణ ప్రజలు మాపై విశ్వాసంతో అధికారం అప్పగించారు

    • తెలంగాణ ప్రజలు అప్పగించిన బాధ్యతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టలేదు

    • తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం

    • కొందరు ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

    • ప్రజలకు నిజం చెప్పకపోతే అవాస్తవాలను నిజాలని నమ్మే అవకాశం ఉంది

  • 2025-03-19T10:04:58+05:30

    రూ.3.20 లక్షలతో తెలంగాణ బడ్జెట్

    • తెలంగాణ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

    • మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క

    • యువతకు ఈ బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు ఉండే ఛాన్స్

  • 2025-03-19T09:43:32+05:30

    కాసేపట్లో తెలంగాణ మంత్రిమండలి సమావేశం

    • కాసేపట్లో తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు ఆమోదం తెలపనున్న తెలంగాణ మంత్రిమండలి

    • సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం

  • 2025-03-19T09:39:48+05:30

    ఇవాళ తెలంగాణ బడ్జెట్

    • శాసనసభలో తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

    • ఎన్నికల హామీల అమలుకు నిధులు కేటాయించే అవకాశం

    • విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత

    • యువత, మహిళా సాధికారతకు పెద్దపీట వేసే అవకాశం