Share News

TGSRTC: మరో 200 కొత్త బస్సులు..

ABN , Publish Date - Apr 26 , 2025 | 08:35 AM

హైదరాబాద్ నగరంలో మరో 200 కొత్త బస్సులు నడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వీటిలో దాదాపు 150 ఎలక్ర్టిక్‌ బస్సులు ఉండనున్నాయి తెలుస్తో్ంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఎలక్ర్టిక్‌ బస్సులు తిరుగుతుండగా మరోకొన్ని కూడా వస్తే ఇక.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

TGSRTC: మరో 200 కొత్త బస్సులు..

- జూలై నాటికి తెచ్చేలా ఆర్టీసీ ప్రణాళికలు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో జూలై నాటికి 200 కొత్త బస్సులను రోడ్లపైకి తెచ్చేలా ఆర్టీసీ(RTC) చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల ప్రారంభం నాటికి అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటిలో దాదాపు 150 ఎలక్ర్టిక్‌ బస్సులు ఉండనున్నాయి. మహాలక్ష్మి(Mahalakshmi) ఉచిత ప్రయాణాలతో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 95 నుంచి 100 శాతంగా నమోదవుతోంది. ప్రధానంగా రద్దీ వేళల్లో సిటీ బస్సులు ఓవర్‌లోడ్‌తో పరుగులు పెడుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: భానుడి భగ.. మీటరు గిరా..


లోడ్‌ తగ్గించడంతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంచుకోవాలంటే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చెబుతున్నారు. అవసరమైన నిధుల కోసం టీజీఎస్‌ ఆర్టీసీ బ్యాంకులను సంప్రదించగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. గ్రేటర్‌ జోన్‌లో రోజూ 23 నుంచి 24 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుండగా, వారిలో 14 నుంచి 15 లక్షల మంది మహిళా ప్రయాణికులే ఉంటున్నారు.


ఈవీ బస్సుల పెంపు

గ్రేటర్‌జోన్‌(Greater Zone)లో ఆర్టీసీ 3,100 బస్సులను నడుపుతోంది. ఈవీ పాలసీని ప్రోత్సహించడంలో భాగంగా రాబోయే రోజుల్లో మొత్తం ఎలక్ర్టిక్‌ బస్సులను మాత్రమే నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 డిసెంబర్‌ నాటికి వెయ్యి ఈవీ బస్సులను గ్రేటర్‌జోన్‌లో అందుబాటులోకి తెచ్చేదిశగా ప్రయత్నాలు చెస్తోంది. ఈక్రమంలోనే గ్రేటర్‌జోన్‌లోని 25 బస్‌ డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా

మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..

బూడిద గుమ్మడితో భలే భలేగా

రజతోత్సవ వేళ రగిలే ప్రశ్నలు

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2025 | 08:35 AM