Share News

TGSRTC: టీ-24 టికెట్‌పై చార్జీల బాదుడు..

ABN , Publish Date - Jul 15 , 2025 | 08:14 AM

గ్రేటర్‌లో టీ-24 టికెట్ల చార్జీలు చార్జీలు రూ.120 నుంచి రూ.150కి పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనరల్‌ బస్‌పాస్‌ చార్జీలను పెంచిన ఆర్టీసీ, అదేదారిలో టీ-24 (ట్రావెల్‌ యాజ్‌ యు లైక్‌) టికెట్‌ చార్జీలను పెంచింది. సీనియర్‌ సిటీజన్లకు టీ-24 టికెట్‌ రూ. 100 చార్జీ ఉండగా దాన్ని రూ. 120కి, పిల్లలకు రూ. 80 నుంచి 100కు పెంచారు.

TGSRTC: టీ-24 టికెట్‌పై చార్జీల బాదుడు..

- జనరల్‌ పాస్‌ రూ. 120 నుంచి రూ.150 కి పెంపు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌(Greater)లో టీ-24 టికెట్ల చార్జీలు చార్జీలు రూ.120 నుంచి రూ.150కి పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనరల్‌ బస్‌పాస్‌ చార్జీలను పెంచిన ఆర్టీసీ, అదేదారిలో టీ-24 (ట్రావెల్‌ యాజ్‌ యు లైక్‌) టికెట్‌ చార్జీలను పెంచింది. సీనియర్‌ సిటీజన్లకు టీ-24 టికెట్‌ రూ. 100 చార్జీ ఉండగా దాన్ని రూ. 120కి, పిల్లలకు రూ. 80 నుంచి 100కు పెంచారు.


ఆధార్‌కార్డు లేకుండా (నాన్‌ ఆధార్‌) బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రూ. 100 ఉన్న టీ-24 టికెట్‌ పాస్‌ను రూ. 120 పెంచారు. టీ-24 టికెట్‌పై ఒకేసారి రూ. 30 చార్జీలు పెంచడంతో అధికభారం పడుతుందని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. సోమవారం పలు సిటీ బస్సుల్లో కొంతమంది ప్రయాణికులు కండక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌జోన్‌లో 25 బస్‌డిపోల పరిధిలో రోజూ 12 వేలకు పైగా టీ-24 టికెట్లు ఆర్టీసీ జారీచేస్తుంది.


పెంచిన చార్జీలు ఇలా..

పాత చార్జీ(రూ).. పెంచిన చార్జీ (రూ)

జనరల్‌ పాస్‌ 120 150

సీనియర్‌

..............................................................................................................

సిటీజన్స్‌ 100 120

నాన్‌ఆధార్‌

.....................................................................................................................

(మహిళలు) 100 120

.........................................................................................................................

పిల్లలు 80 100


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యువతి మోజులో పడి భర్త వేధింపులు.. ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Jul 15 , 2025 | 08:14 AM