Share News

Group-1 : 16 నుంచి గ్రూప్‌-1 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:28 AM

రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) బుధవారం షెడ్యూల్‌ ప్రకటించింది.

Group-1 : 16 నుంచి గ్రూప్‌-1 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

  • నేటి నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) బుధవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 16, 17, 19, 21, 22 తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకూ, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5.30 గంటల వరకూ దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపింది. హైదరాబాద్‌లో నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరిశీలిస్తామని వెల్లడించింది. ధ్రువ పత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. అభ్యర్ధులు ఈ నెల 15 నుంచి 22 సాయంత్రం ఐదు గంటల వరకూ వెబ్‌ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చునని తెలిపింది.


ఎంపికైన అభ్యర్ధులు ఒరిజినల్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని టీజీపీఎస్సీ సూచించింది. నిర్ణీత తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాని వారికి రిజర్వ్‌ డేగా 22 ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వివరించింది. వెరిఫికేషన్‌ నాడు, రిజర్వ్‌ డే రోజు అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురాకపోతే మళ్లీ అవకాశం ఇవ్వబోమని, ఇతర ఉద్యోగాల కోసం వారి పేర్లను పరిశీలించబోమని కూడా టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచిన అభ్యర్థుల్లో హాజరు కాకున్నా, తిరస్కరణకు గురైనా వారి తర్వాత ర్యాంకులు గల అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తామని వివరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 04:28 AM