Medical Recruitment: 201 మంది వైద్యుల నియామకం
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:05 AM
వైద్యశాఖలో నియామకాల జోరు కొనసాగుతోంది. 201 మంది వైద్యుల నియామక తుది జాబితాను వైద్య నియామకాల బోర్డు శనివారం విడుదల చేసింది.

ఎంఎన్‌జేలో 45.. ఆయుష్‌లో 156 మంది
తుది ఫలితాలను విడుదల చేసిన మెడికల్ బోర్డు
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వైద్యశాఖలో నియామకాల జోరు కొనసాగుతోంది. 201 మంది వైద్యుల నియామక తుది జాబితాను వైద్య నియామకాల బోర్డు శనివారం విడుదల చేసింది. ఆయుష్ వైద్యాధికారులు, ఎంఎన్‌జే ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాను తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈమేరకు బోర్డు సెక్రటరీ గోపీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ 201 పోస్టుల్లో ఆయుష్ వైద్యాధికారి పోస్టులు 156 ఉండగా, ఎంఎన్‌జే క్యాన్స ర్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 45 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారి వివరాలను బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. పోస్టుల భర్తీతో ఆయుష్ వైద్య సేవలు మరింత మెరుగవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.