IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎ్‌సల బదిలీ
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:15 AM
రాష్ట్రంలో పలువురు ఐఏఎ్‌సలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రవాణశాఖ కమిషనర్ కె.సురేంద్రమోహన్‌కు, సహకార శాఖ కమిషనర్‌గా, మార్కెటింగ్ డైరక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలువురు ఐఏఎ్‌సలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రవాణశాఖ కమిషనర్ కె.సురేంద్రమోహన్‌కు, సహకార శాఖ కమిషనర్‌గా, మార్కెటింగ్ డైరక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలను ఐఏఎస్ అధికారి ఉదయ్‌కుమార్ నిర్వహించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరక్టర్ ఆర్.వి.కర్ణన్‌కు ఆరోగ్యశ్రీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో కొనసాగిన శివశంకర్ లోహెటినీ జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి కె.హరితను వాణిజ్య పన్నుల శాఖ డైరక్టర్‌గా నియమించారు. ఉద్యాన శాఖ డైరక్టర్ యాస్మిన్ బాషాకు సీడ్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హాకా ఎండీ కె.చంద్రశేఖర్‌రెడ్డికి తెలంగాణ ఫుడ్స్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు తెలంగాణ ఫుడ్స్ ఎండీగా పనిచేసిన బి.శ్రీనివాసరెడ్డిని ఆయన మాతృశాఖ చేనేత జౌళి శాఖకు బదిలీ చేశారు. వనపర్తి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంచిత్ గాంగ్వార్‌ను నారాయణపేట అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా నియమించారు.