Share News

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

ABN , Publish Date - Jun 13 , 2025 | 03:26 AM

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. కొంత మందిని బదిలీ చేసిన ప్రభుత్వం... మరికొంత మందికి అదనపు బాధ్యతలు అప్పగించింది.

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

  • ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ఆర్‌సీగా శశాంక్‌ గోయల్‌

  • విద్యుత్తు శాఖకు నవీన్‌ మిత్తల్‌, టీజీపీఎస్సీకి ప్రియాంక ఆల

  • వెయిటింగ్‌లో ఉన్న శివశంకర్‌, చిట్టెం లక్ష్మికి పోస్టింగులు

  • సీఎం సీపీఆర్వోగా రిటైర్డు అధికారి మల్సూర్‌ నియామకం

  • మరో ముగ్గురు నాన్‌ క్యాడర్‌ అధికారులకూ బాధ్యతలు

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. కొంత మందిని బదిలీ చేసిన ప్రభుత్వం... మరికొంత మందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్‌ గురువారం సమావేశమై ఐఏఎస్‌ అధికారుల బదిలీలపై చర్చించారు. చాలా సేపు మంతనాలు జరిపిన తర్వాత... బదిలీల ప్రక్రియ చేపట్టారు. గత నెల 31న సహకార శాఖ నుంచి రిటైర్‌ అయి, పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా కొనసాగుతున్న నాన్‌కేడర్‌ అధికారి జి.మల్సూర్‌... సీఎం సీపీఆర్వోగా నియమితులయ్యారు. ఆయనను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించినట్లు ప్రభు త్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు స్పెషల్‌ సీఎ్‌సగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయల్‌ను తాజాగా తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.


సుదీర్ఘకాలంగా రెసిడెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్న గౌరవ్‌ ఉప్పల్‌కు కేంద్ర ప్రాజెక్టులు, సీఎ్‌సఎ్‌సల సమన్వయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ను విద్యుత్తు శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ఫిషరీస్‌ డైరెక్టర్‌గా అప్రాధాన్య పోస్టులో ఉన్న ప్రియాంక ఆలను కీలకమైన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పింది. వెయిటింగ్‌లో ఉన్న శివశంకర్‌ లోతేటికి రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా, చిట్టెం లక్ష్మికి జీఏడీ సంయుక్త కార్యదర్శిగా పోస్టింగులు ఇచ్చింది. పాఠశాల విద్యా సంచాలకుడు నర్సింహారెడ్డిని బదిలీ చేసినా పోస్టింగ్‌ ఇవ్వలేదు. పురపాలక శాఖ కమిషనరేట్‌లో అదనపు డైరెక్టర్‌గా ఉన్న జె.శంకరయ్యకు తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఎండీగా పోస్టింగ్‌ ఇచ్చారు. పి.శ్రీకాంత్‌బాబుకు ఆయుష్‌ డైరెక్టర్‌గా, టీజీఐఐసీ అధికారి పవన్‌కుమార్‌కు టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.


అధికారి పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం

శశాంక్‌ గోయల్‌ ఢిల్లీ తెలంగాణ భవన్‌ స్పెషల్‌ సీఎస్‌ ఢిల్లీ తెలంగాణ భవన్‌ స్పెషల్‌ సీఎస్‌ అండ్‌ రెసిడెంట్‌ కమిషనర్‌

నవీన్‌ మిత్తల్‌ రెవెన్యూ ముఖ్యకార్యదర్శి విద్యుత్తు శాఖ ముఖ్యకార్యదర్శి

ఎన్‌.శ్రీధర్‌ ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి,

గనుల శాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు

జ్యోతి బుద్ధా ప్రకాశ్‌ రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణ శాఖల కార్యదర్శి ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి,

ప్రణాళిక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు

లోకేశ్‌కుమార్‌ అదనపు సీఈవో రెవెన్యూశాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏగా అదనపు బాధ్యతలు

గౌరవ్‌ ఉప్పల్‌ ఢిల్లీ తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ తెలంగాణ భవన్‌లో కేంద్ర ప్రాజెక్టులు, సీఎ్‌సఎ్‌సల సమన్వయ కార్యదర్శి

భారతి లక్‌పతి నాయక్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యదర్శి సమాచార హక్కు కమిషన్‌ కార్యదర్శి

హరిచందన దాసరి రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హైదరాబాద్‌ కలెక్టర్‌

కిల్లు శివకుమార్‌ నాయుడు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ నీటి పారుదలశాఖ ఆర్‌అండ్‌ ఆర్‌ కమిషనర్‌

రాజీవ్‌గాంధీ హన్మంతు నిజామాబాద్‌ కలెక్టర్‌ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి,

రిజిస్ట్రేషన్ల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు

టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ నిజామాబాద్‌ కలెక్టర్‌

జి.శ్రీజన పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ మహిళాశిశు సంక్షేమ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు

శివశంకర్‌ లోతేటి వెయిటింగ్‌, ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్స్‌ ఇన్‌చార్జి రెవెన్యూశాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు

చిట్టెం లక్ష్మి వెయిటింగ్‌ జీఏడీ సంయుక్త కార్యదర్శి

కె.హైమావతి ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ పీడీ సిద్దిపేట కలెక్టర్‌

వాసం వెంకటేశ్వర్‌రెడ్డి యూత్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ పీడీ,

ఐహెచ్‌ఎ్‌ఫడబ్ల్యూ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు

గౌతమ్‌ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి గృహనిర్మాణ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు

గౌతమ్‌ పొట్రు మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌ సింగరేణి (పీ అండ్‌ ఏ) డైరెక్టర్‌

కె.నిఖిల టీజీఐఆర్‌డీ సీఈవో ఫిషరీస్‌ డైరెక్టర్‌, టీజీఐఆర్‌డీ సీఈవోగా అదనపు బాధ్యతలు

వల్లూరు క్రాంతి సంగారెడ్డి కలెక్టర్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ

పి.ఉదయ్‌కుమార్‌ వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఆరోగ్యశ్రీ సీఈవో, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ

ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు

ప్రియాంక ఆల ఫిషరీస్‌ డైరెక్టర్‌ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి

పి.ప్రావీణ్య హనుమకొండ కలెక్టర్‌ సంగారెడ్డి కలెక్టర్‌

నిర్మలా క్రాంతి వెస్లీ మహిళా సంక్షేమ డైరెక్టర్‌ తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ కార్యదర్శి, సీఈవో,

మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీగా అదనపు బాధ్యతలు

మిక్కిలినేని మను చౌదరి సిద్దిపేట కలెక్టర్‌ మేడ్చల్‌ కలెక్టర్‌

ముజమ్మిల్‌ ఖాన్‌ ఖమ్మం కలెక్టర్‌ పౌర సరఫరాల డైరెక్టర్‌, జాయింట్‌ సెక్రటరీగా, చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌

స్నేహ శబరీష్‌ జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ హనుమకొండ కలెక్టర్‌

అనుదీప్‌ దురిశెట్టి హైదరాబాద్‌ కలెక్టర్‌ ఖమ్మం కలెక్టర్‌

నవీన్‌ నికొలస్‌ టీజీపీఎస్సీ కార్యదర్శి పాఠశాల విద్యా డైరెక్టర్‌,

సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు

ప్రియాంక పురపాలక శాఖ డిప్యూటీ కార్యదర్శి సమాచార, పౌర సంబంధాల స్పెషల్‌ కమిషనర్‌

చాహత్‌ బాజ్‌పాయ్‌ కరీంనగర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కమిషనర్‌

అశ్వినీ తానాజీ వాకడే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌

ప్రఫుల్‌ దేశాయ్‌ కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌ కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌

బి.షఫియుల్లా గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌ కమిషనర్‌ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి,

మైనారిటీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా దనపు బాధ్యతలు

వీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌ పౌర సరఫరాల డైరెక్టర్‌ హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ డైరెక్టర్‌

నిఖిల్‌ చక్రవర్తి టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరిశ్రమల శాఖ డైరెక్టర్‌


ఈ వార్తలు కూడా చదవండి..

కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..

లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 03:43 AM