‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లుగా మూడు టిమ్స్
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:18 AM
రాజధానిలో నిర్మిస్తోన్న మూడు టిమ్స్ ఆస్పత్రులను సెంటర్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అల్వాల్‌లో న్యూరో, సనత్‌నగర్‌లో కార్డియాక్, కొత్తపేటలో గ్యాస్ట్రో సైన్సెస్ ఆస్పత్రుల ఏర్పాటు
అధికారికంగా ప్రకటించిన మంత్రి దామోదర
ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): రాజధానిలో నిర్మిస్తోన్న మూడు టిమ్స్ ఆస్పత్రులను సెంటర్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అల్వాల్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరో సైన్సెస్, సనత్‌నగర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ సైన్సెస్, కొత్తపేటలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గ్యాస్ర్టో సైన్సె్‌సను అభివృద్ధి చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ‘‘ఆంధ్రజ్యోతి’’ ముందే చెప్పింది. ‘‘సర్కారీ స్పెషాలిటీ’’ పేరిట ఈ నెల 1న ఓ కథనాన్ని ఇచ్చింది.
మూడు టిమ్స్, మెడికల్ కాలేజీలు, వరంగల్ హెల్త్ సిటీ భవన నిర్మాణ పనులపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల భవన నిర్మాణ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తామని అధికారులు వివరించగా.. పనులు ఆలస్యం కావడంపై మంత్రి దామోదర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షకాలం మొదలయ్యేలోగా నిర్మాణ పనులన్నీ కొలిక్కి రావాలని అధికారులను ఆదేశించారు.