Share News

Summer Holidays: మే ఒకటి నుంచి వేసవి సెలవులు

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:40 AM

రాష్ట్రంలోని 30 తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచే సెలవులిచ్చారు.

Summer Holidays: మే ఒకటి నుంచి వేసవి సెలవులు

రాష్ట్రంలోని 30 తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచే సెలవులిచ్చారు. ఉస్మానియా విద్యార్థులకు మే 1 నుంచి 30వరకు, మహాత్మాగాంధీ, కాకతీయ విశ్వవిద్యాలయాలకు మే 31వరకు, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు జూన్‌ ఒకటో తేదీ వరకు సెలవులు ఖరారు చేశారు. పాలమూరు యూనివర్సిటీకి మే 2 నుంచి జూన్‌ 1 వరకు సవరించారు.


కొన్ని విశ్వవిద్యాలయాల్లో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతుండటంతో షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థులు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షల సమయంలో విద్యార్థులకు వసతులు కల్పించడంతో పాటు ఆయా సబ్జెక్టుల అధ్యాపకులను కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 04:40 AM