Thummala Nageshwar Rao: దిగొచ్చిన కేంద్రం
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:11 AM
పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎ్‌ఫసీఎల్)నుంచి ఆగస్టు నెలలో తెలంగాణకు 65 వేల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ (డీఓఎఫ్) ఆదేశించింది.

రాష్ట్రానికి ఈ నెలలో 65 వేల టన్నుల యూరియా సరఫరా
ఆర్‌ఎ్‌ఫసీఎల్‌కు ఎరువుల శాఖ ఆదేశం
58 రోజుల షట్‌డౌన్‌తో తగ్గిన ఉత్పత్తి
కోల్‌సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎ్‌ఫసీఎల్)నుంచి ఆగస్టు నెలలో తెలంగాణకు 65 వేల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ (డీఓఎఫ్) ఆదేశించింది. జూన్‌లో 30 వేల టన్నులకు 14 వేల టన్నులు, జూలైలో 30 వేల టన్నులకు 16 వేల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మే, జూన్ నెలల్లో వార్షిక మరమ్మతులతో 40 రోజులు, గత నెలలో అమ్మోనియా పైపులైన్ లీకేజీతో 18 రోజులు ప్లాంట్ షట్‌డౌన్ కావడంతో 58 రోజుల్లో 2.5 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తికి విఘాతమేర్పడింది. ప్లాంట్ సరిగ్గా నడిచి ఉంటే గత రెండు నెలల్లో 65 వేల టన్నుల యూరియా రవాణాకు అవకాశముండేది.
రాష్ట్రానికి గతేడాదితో పోలిస్తే 25 శాతం యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. దీంతో తెలంగాణకు యూరియా కోటా తగ్గించారని, అవసరాలకు సరిపడా ఇవ్వాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవసరానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని తరచూ కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు అధికారులను ఢిల్లీకి పంపుతున్నారు.