Share News

Kamareddy: భిక్కనూరు క్యాంప్‌సలో విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:06 AM

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని బీటీఎస్‌ చౌరస్తాలో గల తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంప్‌సలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

Kamareddy: భిక్కనూరు క్యాంప్‌సలో విద్యార్థిని ఆత్మహత్య

భిక్కనూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని బీటీఎస్‌ చౌరస్తాలో గల తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంప్‌సలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్‌ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన దండు అశ్విని(24) భిక్కనూరు సౌత్‌ క్యాంప్‌సలో పీజీ తెలుగు రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ హాస్టల్‌ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది.


గమనించిన తోటి విద్యార్థినులు తలుపులు తీయమని ఎంత బతిమాలినా ఎలాంటి స్పందన రాకపోవడంతో తోటి విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకుని తలుపులు బద్దలు కొట్టగా అశ్విని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే హాస్టల్‌ సిబ్బంది సహాయంతో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. అశ్వినికితల్లిదండ్రులు సాయవ్వ-సాయిలు, ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. ఆమె మృతికి కారణాలు తెలియలేదు.

Updated Date - Aug 04 , 2025 | 05:06 AM