KCR: చంద్రబాబుకు కేసీఆర్ బర్త్ డే శుభాకాంక్షలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 01:45 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్..ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు చంద్రబాబుకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు (TDP National President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu)కు బీఆర్ఎస్ అధ్యక్షుడు (BRS Chief), తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్ర శేఖర్ రావు (Ex CM KCR) జన్మదిన శుభాకాంక్షలు (Birthday Wishes) తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు చంద్రబాబుకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు.
Also Read..: చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు...
చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు..
కాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంచి పనులు చేశారన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన హైటెక్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధిని తాము కొనసాగించామని చెప్పారు. మంచి పనులను బీఆర్ఎస్ ఎప్పుడూ అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తానంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో..
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నందమూరి సుహాసిని, టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, తెలుగుదేశం నేత అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ.. 75 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకు హృదపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ అంటే ఒకప్పుడు చార్మినార్ అని చెప్పుకునేవారు.. నేడు మాత్రం ఐటిసిటీ కోసం మాట్లాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు విజన్ ఎంతో గొప్పదని అన్నారు. 2047 విషన్ పేరుతో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి జరుగుతుందని, హైదరాబాద్ ఐటి సిటీగా ఎంతో ప్రసిద్ధి చెందిందని సుహాసిని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు విజన్ ఎంతో గొప్పది..
MP Kesineni Chinni: చంద్రబాబు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం..
టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు..
For More AP News and Telugu News