Share News

IPS Transfers: 8 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:26 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 8మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న పి.విశ్వ ప్రసాద్‌ను హైదరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు సీపీగా నియమించారు.

IPS Transfers: 8 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 8మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న పి.విశ్వ ప్రసాద్‌ను హైదరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు సీపీగా నియమించారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీగా జోయల్‌ డేవి్‌స,సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీగా డాక్టర్‌ గజారావు భూపాల్‌, ఎస్‌.చైతన్యకుమార్‌ను హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా, నవీన్‌ కుమార్‌,బి.రామిరెడ్డిలను సీఐడీ ఎస్పీలుగా, సిహెచ్‌ శ్రీధర్‌ను ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా నియమించారు. గవర్నర్‌ ఏడీసీగా ఉన్న సంకీర్త్‌ను అదే స్ధానంలో ఎస్పీ పదోన్నతిపై కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Feb 24 , 2025 | 04:26 AM