Share News

Dubai Tragedy Victims: స్వస్థలాలకు దుబాయ్‌లో హత్యకు గురైన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ మృతదేహాలు

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:26 AM

దుబాయ్‌లో పాకిస్థానీ ఉన్మాదికి బలైన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. ఆక్రందించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతుల ఆత్మకోసం కన్నీరు తడిపి అంత్యక్రియలు నిర్వహించారు

Dubai Tragedy Victims: స్వస్థలాలకు దుబాయ్‌లో హత్యకు గురైన ప్రేమ్‌సాగర్‌, శ్రీనివాస్‌ మృతదేహాలు

  • విమానాశ్రయంలో నివాళులర్పించిన అధికారులు

  • స్వగ్రామాల్లో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి, శంషాబాద్‌ రూరల్‌, సోన్‌, ధర్మపురి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): దుబాయ్‌లో పాకిస్థానీ ఉన్మా ది చేతిలో దారు ణ హత్య కు గురైన ఇద్దరు తెలంగాణ ప్రవాసీయుల మృతదేహాలు వారం తర్వాత శనివారం స్వస్థలాలకు చేరగా.. అంత్యక్రియలు నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలానికి చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్‌, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివా్‌సలు హత్యకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో వీరి మృతదేహాలను పేటికలలో ప్యాకింగ్‌ చేసే సందర్భంలో ప్రవాసీ కార్యకర్తలు గుండెల్లి నర్సింహులు, ఎస్వీ రెడ్డి, దోనికేని కృష్ణ, కటుకం రవి, వంశీ గౌడ్‌ ఉన్నారు. శనివారం తెల్లవారుజామున ఇద్దరి మృతదేహాలు దుబాయ్‌ నుంచి బయలుదేరి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్‌, అంబాసిడర్‌ డాక్టర్‌ బీఎం వినోద్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్‌ తదితరులు శవపేటికలపై ప్రభుత్వ పక్షాన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


ఇద్దరి మృతదేహాలను ప్రభుత్వం సమకూర్చిన అంబులెన్స్‌లలో వారి స్వస్థలాలకు పంపారు. సోన్‌ గ్రామానికి అష్టపు ప్రేమ్‌సాగర్‌ మృతదేహం చేరుకోగానే ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రేమ్‌సాగర్‌ మృతదేహానికి గోదావరి వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, దమ్మన్నపేటకు స్వర్గం శ్రీనివాస్‌ మృతదేహం చేరుకోగానే మృతుడి భార్య జమున, కొడుకులు చందు, సూర్య, తల్లి రాజవ్వ కన్నీరుమున్నీరుగా విలపించారు. గోదావరి నది వద్ద మృతుడి అంత్యక్రియలు నిర్వహించగా ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దుబాయ్‌లో ఇద్దరు హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఎన్‌ఆర్‌ఐ పాలసీ కింద రూ.5 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్ల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాలు త్వరగా స్వస్థలాలకు రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లకు మృతుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 04:26 AM