Share News

Discoms: తగ్గుతున్న డిస్కమ్‌ల నష్టాలు!

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:56 AM

తెలంగాణ డిస్కమ్‌లు క్రమంగా నష్టాలను తగ్గించుకునే దిశగా పయనం సాగిస్తున్నాయా...? అవుననే చెబుతున్నాయి గణాంకాలు. తొలి ఆర్నెల్ల డిస్కమ్‌ల లెక్కలను పరిశీలిస్తే... క్రమంగా నష్టాల ఊబి నుంచి డిస్కమ్‌లు క్రమంగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

Discoms: తగ్గుతున్న డిస్కమ్‌ల నష్టాలు!

  • ఆర్నెల్లలో కేవలం రూ.68.13 కోట్ల నష్టాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ డిస్కమ్‌లు క్రమంగా నష్టాలను తగ్గించుకునే దిశగా పయనం సాగిస్తున్నాయా...? అవుననే చెబుతున్నాయి గణాంకాలు. తొలి ఆర్నెల్ల డిస్కమ్‌ల లెక్కలను పరిశీలిస్తే... క్రమంగా నష్టాల ఊబి నుంచి డిస్కమ్‌లు క్రమంగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో గతేడాది (2024) సెప్టెంబరుతో ముగిసిన అర్థ వార్షికంలో నష్టాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. దక్షిణ డిస్కమ్‌ 2024 తొలి ఆర్నెల్ల కాలానికి(ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30) రూ.21,389.64 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా... ఖర్చుఉలు రూ.21,590.85 కోట్లు అయ్యాయి. పన్నులు, ఇతరత్రా కలుపుకొని తొలి ఆర్నెల్లలో రూ.213.88 కోట్ల నష్టాలను చవిచూసింది. ఇక, ఉత్తర డిస్కమ్‌ (ఎన్పీడీ సీఎల్‌-వరంగల్‌) తొలి ఆర్నెల్లలో రూ.9166.17 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా... రూ.9033.09 కోట్లు వ్యయమైంది.


ఉత్తర డిస్కమ్‌ తొలి ఆర్నెల్లలో రూ.133.08 కోట్ల లాభాలను నమోదు చేసింది. రెండు డిస్కమ్‌లు కలిపి తొలి అర ్థవార్షికంలో రూ.30,555.81 కోట్ల ఆదాయాన్ని రికార్డు చేయగా... రూ.30,623.94 కోట్లు వ్యయం అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాంతో రెండు డిస్కమ్‌లు కలిపి ఆర్నెల్లలో రూ.68.13 కోట్ల నష్టాలను మాత్రమే చవిచూశాయి. కాగా, దక్షిణ డిస్కమ్‌ తొలి ఆర్నెల్లలో రూ.21,389.64 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా... రూ.17,674.20 కోట్లను కరెంట్‌ కొనుగోళ్లకే వెచ్చించారు. ఉద్యోగుల జీతాలు/భత్యాల కోసం రూ.1320.59 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఉత్తర డిస్కమ్‌ ఆర్నెల్లలో రూ.9166.17కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోగా... అందులో రూ.6706కోట్లను కరెంట్‌ కొనుగోళ్లకు పెట్టారు. ఇక ఉద్యోగుల జీత/భత్యాల కోసం రూ.1224.69 కోట్లను వెచ్చించారు. 2023-24 (2024 మార్చి 31వ తేదీ)లెక్కలు పరిశీలిస్తే రూ.64,227కోట్ల నష్టాలను డిస్కమ్‌లు మూటగట్టుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 04:56 AM