Crime Control: ఆపదలో నేస్తం డయల్ 112
ABN , Publish Date - Jun 15 , 2025 | 03:37 AM
రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా డయల్ 112కు ఫోన్ చేస్తే భరోసా దొరకుతుందని నమ్మకం కలిగించే దిశగా పనిచేస్తున్నామని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్..

ఒకే రోజు నాలుగు చోట్ల నేరాలను నియంత్రించాం
అత్యవసర పరిస్థితుల్లో ఆఘమేఘాల మీద యాక్షన్
టీజీఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా డయల్ 112కు ఫోన్ చేస్తే భరోసా దొరకుతుందని నమ్మకం కలిగించే దిశగా పనిచేస్తున్నామని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) డైరక్టర్ కమలాసన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం డయల్ 112కు వచ్చిన ఫిర్యాదులకు సంబంఽధించి నాలుగు సంఘటనల్లో నేరాలను నియంత్రించగలిగామని ఆయన వివరించారు. డయల్ 112కు ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే సిబ్బంది వేగంగా స్పందించి ఆయా జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసి నిమిషాల వ్యవధిలో నేరం జరిగిన ప్రాంతానికి చేరుకోవడం వల్ల నాలుగు సంఘటనల్లో ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
కోకాపేట ప్రాంతంలో ఓ చిన్నారి అదృశ్యమైందని ఫోన్ రావడంతో సకాలంలో స్పందించి చిన్నారి ఆచూకీ కనుగొని తల్లికి అప్పగించామని ఆయన తెలిపారు. అంబర్‌పేటలో అనుమతి లేకుండా ఒక మహిళను వీడియో తీస్తున్న యువకుడిని మహిళ ఫిర్యాదు మేరకు పట్టుకున్నామని, తండ్రిని చంపడానికి ప్రయత్నిస్తోన్న కొడుకును కేతేపల్లి పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారని, సంగారెడ్డిలో అత్త మీద అత్యాచారయత్నం చేసిన ఓ వ్యక్తిని పట్టుకున్నామని కమలాసన్ రెడ్డి తెలిపారు.