Share News

Air India Express Emergency: ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:25 AM

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది

Air India Express Emergency: ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
Air India Express Emergency

  • టేకాఫ్‌ అయిన కాసేపటికే ల్యాండింగ్‌

శంషాబాద్‌ రూరల్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తిరిగి శంషాబాద్‌లోనే ల్యాండ్‌ అయింది. శనివారం ఉదయం 6:49 గంటలకు 98 మంది ప్రయాణికులతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఐఎక్స్‌ 110 విమానం ఫుకెట్‌కు బయలుదేరింది. అయితే, గాల్లోకి ఎగిరిన 8 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. గమనించిన పైలెట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం ఏటీసీ అధికారుల అనుమతి కోరారు. వెంటనే స్పందించిన అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు. ఉదయం 6:57 గంటలకు పైలట్‌ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం మధ్యాహ్నం 1:26 గంటలకు విమానం తిరిగి ఫుకెట్‌కు బయలుదేరింది.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 04:25 AM