Share News

Supreme Court: తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:57 AM

తెలంగాణలో న్యాయాధికారులుగా అర్హత సాధించేందుకు తెలుగులో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది.

Supreme Court: తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి

  • తెలంగాణ న్యాయాధికారుల నియామకంపై సుప్రీంకోర్టు

  • రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను సమర్థించిన ధర్మాసనం

  • ఉర్దూలో ప్రావీణ్యం నిబంధనను కూడా చేర్చాలన్న

  • పిటిషన్‌పై విచారణకు నిరాకరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో న్యాయాధికారులుగా అర్హత సాధించేందుకు తెలుగులో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. తెలంగాణ జ్యుడిషియల్‌ సర్వీ్‌సలో చేరే అభ్యర్థులకు తెలుగులో ప్రావీణ్యం తప్పనిసరి అని స్పష్టం చేసింది. తెలంగాణ జ్యుడిషియల్‌ (సర్వీస్‌ అండ్‌ కేడర్‌) రూల్స్‌-2023 ద్వారా ఉర్దూను మినహాయించారని పిటిషనర్‌ మహ్మద్‌ షుజాత్‌ హుస్సేన్‌ లేవనెత్తిన వాదనను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, అగస్టిన్‌ జార్జ్‌ మసీ్‌హలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.


పరీక్షల్లో ఉర్దూను మినహాయించలేదని, తెలుగులో ప్రావీణ్యం కలిగి ఉండాలన్న నిబంధనను చేర్చామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. జూన్‌ 2023లో అమల్లోకి వచ్చిన నియమాల ప్రకారం తెలంగాణ జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసే అభ్యర్థులకు తప్పనిసరిగా తెలుగులో ప్రావీణ్యం ఉండాలి. అయితే తన విద్యాభ్యాసం మొత్తం ఉర్దూ మీడియంలోనే జరిగిందని, కావున నియామకాల్లో ఉర్దూలో ప్రావీణ్యం నిబంధనను కూడా చేర్చాలని పిటిషనర్‌ కోరారు. ఉర్దూ భాష తెలంగాణ సంస్కృతిలో భాగమని, తెలంగాణ అధికార భాషల చట్టం-1966 ప్రకారం ఉర్దూ రెండో అధికార భాషగా గుర్తింపు పొందిందని తెలిపారు. పిటిషనర్‌ వాదనతో విభేదించిన సుప్రీం కోర్టు.. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను ముగిస్తున్నట్టు తెలిపింది.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 03:57 AM