Share News

Special Train: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:27 AM

శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుండి కేరళలోని కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు.

Special Train: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు

- 24న కాట్పాడి మీదుగా కొట్టాయంకు ప్రత్యేక రైలు

చెన్నై: శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి(Cherlapalli) నుండి కేరళలోని కొట్టాయం(Kottayam) వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఈ రైలు 24వ తేదీ ఉదయం 10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.


city10.2.jpg

మరుమార్గంలో కొట్టాయం నుంచి నవంబరు 25వ తేదీ రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున చర్లపల్లి(Cherlapalli)కి చేరుకుంటుంది. ఈ రైలు కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్‌ రైల్వేస్టేషన్లలో ఆగివెళుతుందని దక్షిణ రైల్వే తెలిపింది.


city10.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 11:54 AM