Share News

Telangana Assembly: రేపటి నుంచి అసెంబ్లీ

ABN , Publish Date - Mar 11 , 2025 | 03:53 AM

శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Telangana Assembly: రేపటి నుంచి అసెంబ్లీ

  • బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సమీక్ష

  • అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి: గుత్తా

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సోమవారం తన చాంబర్‌లో పోలీసు, ఇంటెలిజెన్స్‌ అధికారులతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ బండా ప్రకాశ్‌, సీఎస్‌ శాంతికుమారి,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు సభ లోపల, వెలుపల శాంతియుత వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.


ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు సకాలంలో చేరుకొనేలా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయని, గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ముద్రించాలని అధికారులకు సూచించారు. శాసన మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ... సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పని చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 11 , 2025 | 03:53 AM