Share News

Gaddam Prasad Kumar: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలిచ్చాం..

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:34 AM

‘‘శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చారు.

Gaddam Prasad Kumar: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలిచ్చాం..

  • అప్పు, మిత్తి ఎంత ఉందో తెలియదు

  • తొలిరోజుల్లో జీతాలివ్వలేని పరిస్థితి

  • హామీల అమలుకు సీఎం రేవంత్‌ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు

  • స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వ్యాఖ్యలు

రాజేంద్రనగర్‌/యాదాద్రి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ‘‘శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక, అప్పు, మిత్తి ఎంత ఉందో తెలియక ఆ హామీలు ఇవ్వడం జరిగింది. అధికారం చేపట్టిన తొలిరోజుల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి యంగ్‌ అండ్‌ డైనమిక్‌ ముఖ్యమంత్రి’’ అని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కొనియాడారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి స్థానంలో ఎవరున్న ఈ రాష్ట్ర పరిస్థితులు మారే అవకాశం లేదని చెప్పారు.


తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితీ లేదని, ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ.. ఇప్పుడు ప్రతీనెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిని ముఖ్యమంత్రి తీసుకువచ్చారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేప్పటికి రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, దానికి నెలకు రూ.6,500 కోట్లు మిత్తి కడుతున్నామని ఆయన వివరించారు. కాగా, ఇటీవలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతుబంధు పేరు మార్చి, రైతు భరోసాగా మార్చి పెట్టుబడి సాయం చేస్తూ వస్తున్నాం, మధ్యలో ఒకసారి మాత్రం డుమ్కీ కొట్టాం’ అని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెంలో ఈ నెల 26న జరిగిన సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఊళ్లలోకి పోతే జనం తిడుతున్నరు.. కేసీఆరే బాగుండే.. కాంగ్రెసోళ్లు ఇస్తలేరు.. అని అంటున్నరు’ కదా అని ప్రశ్నించగా అక్కడున్నవారు అవునని సమాధానమిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంతో కోతలు విధిస్తున్నామని, పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య

ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 03:34 AM