Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ విచారణ.. ఇక ప్రవీణ్ వంతు
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:14 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సిద్ధమవుతోంది.

ఆయన వాంగ్మూలం సేకరణకు సిద్ధమవుతున్న సిట్ అధికారులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ట్యాపింగ్‌పై ఆర్‌ఎస్పీ ఫిర్యాదు
పోలీసులు పట్టించుకోవట్లేదని అప్పట్లో బీఎస్పీ నేతగా విమర్శలు
ఆ ఫిర్యాదుపై విచారించాలని తాజాగా సిట్ నిర్ణయం
ఫోరెన్సిక్ విశ్లేషణకు ప్రభాకర్‌రావు ఫోన్, ల్యాప్‌టాప్
త్వరలో సిట్ ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సిద్ధమవుతోంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను సిట్ విచారించి, వాంగ్మూలాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్‌కు నోటీసులను జారీచేసి, విచారించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్పీ.. సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల సమయంలో తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ‘‘నేను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదు’’ అని బహిరంగంగా విమర్శించారు. ఈ ఫిర్యాదుపై ఇప్పుడు సిట్ ఆర్‌ఎస్పీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్ సోమవారం ఎక్స్‌లో స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశ భద్రతను బజారులో తాకట్టు పెట్టింది. మీ(కాంగ్రెస్) బాధ్యతారాహిత్యం వల్ల శత్రు దేశాలకు కూడా మన రహస్య వ్యవస్థల గురించి తెలిసిపోయింది’’ అని ఆరోపించారు. అప్పట్లో బీఎస్పీ నేతగా బీఆర్‌ఎ్‌సను నిందించిన ఆర్‌ఎస్పీ.. ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతగా కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తన సెల్‌ఫోన్, ల్యాప్ ట్యాప్‌ను సిట్ అధికారులకు అప్పగించారు. సిట్ అధికారులు వాటిని సాంకేతికంగా విశ్లేషించించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎ్‌ఫఎ్‌సఎల్)కు పంపించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో ప్రభాకర్‌రావు రెండు సెల్‌ఫోన్లను ఉపయోగించినట్లు అధికారులకు సమాచారం ఉంది. ఒకటి అధికారిక నంబరు, మరొకటి వ్యక్తిగత ఫోన్ నంబరు. అయితే ఒక నంబరుకు సంబంధించిన సెల్‌ఫోన్‌ను మాత్రమే ఆయన సిట్‌కు అప్పగించారు.
పలువురి వాంగ్మూలాలకు కసరత్తు
ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు సిట్ నోటీ్‌సలు జారీచేసి, వారి వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నుంచి వాంగ్మూలం నమోదు చేసేందుకు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. నిజానికి ఆయన గత శనివారం సిట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఒకట్రెండ్రోజుల్లో సిట్ ఎదుట హాజరవుతారని సమాచారం. మరికొందరు రాజకీయ నేతలు, వారి అనుచరులను కూడా సిట్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇదే కోవలో.. వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి, కోట్లలో ఎలక్టోరల్ బాండ్లు కొనిపించుకున్న ఉదంతంపై సిట్ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో అప్పట్లో ట్యాపింగ్ ముఠా బాధితులుగా ఉన్న వ్యాపారవేత్తలను విచారించనున్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో యెన్నంకు పిలుపు
మహబూబ్‌నగర్: ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఈనెల 10 స్టేట్‌మెంట్ రికార్డ్‌కు హాజరుకావాలని మహబూబ్‌నగ ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డికి అధికారుల నుంచి పిలుపు వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని ఎన్నికల అనంతరం ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ వేగవంతమైన నేపథ్యంలో ఈనెల 10న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి