Flight Delays: శంషాబాద్ నుంచి పలు విమానాల రద్దు
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:17 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు శుక్రవారం రద్దయ్యాయి. సాంకేతిక లోపం తలెత్తడంతోనే రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

శంషాబాద్ రూరల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు శుక్రవారం రద్దయ్యాయి. సాంకేతిక లోపం తలెత్తడంతోనే రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు 92 మంది ప్రయాణికులతో ముంబయి వెళ్లాల్సిన విమానంలో (ఎయిర్ ఇండియా ఏఐ 2534) టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని అక్కడే నిలిపివేశాడు.
ఎంత ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మరో విమానంలో (ఏఐ 2445) ప్రయాణికులను ముంబయికి తరలించారు. అలాగే బ్యాంకాక్, దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన ఽఽథాయ్ ఎయిర్‌లైన్స్ (3జీ 329), ఏఐ 2204 విమానాల్లో కూడా సాంకేతిక లోపం తలెత్తడంతో రద్దయ్యాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.