RS Praveen Kumar: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సిట్ రెండో నోటీసు
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:21 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు

హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు శనివారం రెండో నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో ఆయనకు అనుకూలమైన సమయంలో సిట్ విచారణకు హాజరుకావాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. విచారణకు వచ్చే తేదీ, సమయాన్ని దర్యాప్తు అధికారికి ముందు తెలియజేయాలని నోటీసులో సూచించారు. ఈ నెల 14న జారీ చేసిన నోటీసులో రెండు రోజుల్లో విచారణకు రావాలని సిట్ అధికారులు ప్రవీణ్ కుమార్‌ను కోరారు. అయితే సిట్ నోటీసు విషయాన్ని ఆయ న తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా అందరికి తెలిపినప్పటికీ విచారణకు మాత్రం హాజరుకాలేదు. ఈ క్రమంలో ఆయనకు రెండో నోటీసు జారీ అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News