Hyderabad: కోకాపేట ‘నియోపోలీసు’లో రిజర్వాయర్
ABN , Publish Date - Jan 21 , 2025 | 10:20 AM
కోకాపేట నియోపోలీసు లేఅవుట్(Kokapet Neopolice Layout)లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల్లో భాగం గా తాగునీటి సరఫరాకు రిజర్వాయర్‌ను నిర్మాణం చేయనున్నారు.

- నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హెచ్‌ఎండీఏ కమిషనర్, వాటర్‌బోర్డు ఎండీ
హైదరాబాద్ సిటీ: కోకాపేట నియోపోలీసు లేఅవుట్(Kokapet Neopolice Layout)లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల్లో భాగం గా తాగునీటి సరఫరాకు రిజర్వాయర్‌ను నిర్మాణం చేయనున్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటికే హెచ్‌ఎండీఏ స్థలం కేటాయించగా, సోమవారం హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఐదో అంతస్తు నుంచి పడి యువకుడి మృతి
గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టు నుంచినీటిని తీసుకుని ఖానాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించడానికి.. నియోపోలీస్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంప్‌హౌజ్, స్థానిక అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మాణానికి స్థలం కావాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి.. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ సుదర్శన్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్, ఇంజనీర్లు రవీందర్ రెడ్డి, అప్పారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాండూట్‌ను కబ్జా చేస్తే తొలగించాలి: ఎండీ అశోక్‌రెడ్డి
గండిపేట్ నుంచి ఆసిఫ్‌నగర్(Asifnagar) ఫిల్టర్ బెడ్స్ వరకు ఉన్న కాండూట్‌ని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి(Water Board MD Ashok Reddy) పరిశీలించారు. ఎక్కడైనా కాండూట్ కబ్జాకు గురైనట్లు గమనిస్తే విజిలెన్స్ అధికారుల సాయంతో తొలగించాలని ఆదేశాలిచ్చారు. కాండూట్‌కు రెండు వైపులా మెయింటెనెన్స్ రోడ్లు ఉన్నందున ఆ భాగం వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అక్కడక్కడ జరుగుతున్న కాండూట్ లీకేజీలను గుర్తించి వెంటనే వాటిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖానాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను, కోకాపేట్‌లో వాటర్‌బోర్డు రిజర్వాయర్ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రెజర్ ఫిల్టర్స్‌ను పరిశీలించారు. ఫిబ్రవరి 15 లోపు వీటి నిర్మాణాలను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!
ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్?
ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా
ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు
Read Latest Telangana News and National News