Crime News: శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..
ABN , Publish Date - Apr 07 , 2025 | 10:36 AM
కల్వకోల్‌కు చెందిన శంకరయ్యను అదే గ్రామానికి చెందిన గూడెపు నర్సింగ్‌రావు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

మహేశ్వరం: కల్వకోల్ గేటు సమీపంలో జరిగిన గూడెపు శంకరయ్య (Shankarayya) హత్య కేసు మిస్టరీని (Murder Mystery) పోలీసులు చేధించారు (Police Solved). యాక్సిడెంట్ ముసుగులో హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ ఘటన మహేశ్వరం (Maheshwaram) జోన్లో జరిగింది. భూతగాదాల వివాదంలో శంకరయ్య అనే వ్యక్తిని నిందితులు హత్య చేశారు. ఓ ప్లాన్ ప్రకారం ప్రత్యర్థులు శంకరయ్యను హత్య చేశారు. ఈ కేసులో మహేశ్వరం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. బైక్ పై వెళుతున్న శంకరయ్యను పథకం ప్రకారం కారుతో ఢీ కొట్టి చంపినట్లు పోలీసులు అధారాలు సేకరించారు. సిసి కెమెరా దృశ్యాలను గమనించి శంకరయ్యది హత్యగా తేల్చారు. హత్య చేసేందుకు ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల రెండో తేదీన కల్వకోల్ గేటు సమీపంలో నిందితులు శంకరయ్యను హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నర్సింగరావుతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read..: నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్
పూర్తి వివరాలు..
కల్వకోల్‌కు చెందిన శంకరయ్యకు అదే గ్రామానికి చెందిన గూడెపు నర్సింగ్‌రావుల మధ్య భూమి విషయంలో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల శంకరయ్య..హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డరు తీసుకొని భూమి పోజిషన్ ఇప్పించాలని రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించారు. సర్వేయర్, ఆర్‌ఐలు పొలం వద్దకు వచ్చి పంచనామ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో 50 ఏళ్ల నుంచి తన దగ్గర ఉన్న భూమి పోతోందని నర్సింగ్‌రావు కక్ష పెంచుకుని.. శంకరయ్య హత్యకు కుట్రపన్నాడు. తన బావమరిది బక్కని కార్తీక్‌కు హత్య కుట్ర పథకాన్ని వివరించాడు. దీంతో కార్తీక్.. అదే గ్రామానికి చెందిన స్నేహితుడు కొండని ప్రశాంత్ సహాయం తీసుకున్నాడు. వారికి గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాస్ తోడయ్యారు. ప్రశాంత్‌కు రూ.12 లక్షలు అప్పులు ఉన్నాయి. శంకరయ్యను హత్య చేసిన తర్వాత రూ.12 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓ కారు అద్దెకు తీసుకొని ప్రశాంత్‌కు ఇచ్చారు. ఈ నెల 2న శంకరయ్య ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. కల్వకోల్ గేటు సమీపంలో బైక్‌ను వెనక నుంచి కారుతో ప్రశాంత్ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో శంకరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి.. రోడ్డు ప్రమాదం కాదని హత్యగా తేల్చారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వెనుకనుంచి కారుతో ఢీ కొట్టి..
సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్యను (60) అదే గ్రామానికి చెందిన ఏ1 కొండని ప్రశాంత్(20), ఏ2 గూడెపు నర్సింగ్ రావు (38), ఏ3 బక్కని కార్తీక్ (19), ఏ4 గూడెపు కుమార్(45), ఏ5 గూడెపు శ్రీనివాస్ (42)లు కలిసి పథకం ప్రకారమే హత్య చేశారని చెప్పారు. శంకరయ్య ఈనెల 2వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో స్వగ్రామానికి తన బైక్ మీద వెళ్తున్న క్రమంలో కల్వకోల్ గేట్ వద్ద శంకరయ్య బైక్‌ను అదే గ్రామానికి ఏ1 కొండని ప్రశాంత్ వెనుక నుంచి కారుతో ఢీ కొట్టాడని, తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. శంకరయ్య మృతిపై అనుమానం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు చేశారని.. కేసు నమోదు చేసి విచారించగా హత్య ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ గిరిజన గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన..
భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం
For More AP News and Telugu News
Ad