Share News

Hyderabad: అమెరికాలోని బోస్టన్‌ సైట్‌ బోర్డు సభ్యుడిగా రామం ఆత్మకూరి

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:39 AM

ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌గా సేవలందించిన రామం ఆత్మకూరి బోస్టన్‌ సైట్‌ బోర్డు సభ్యుడిగా బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా బోస్టన్‌ సైట్‌ సీఈఓ సారా యోస్ట్‌ మాట్లాడుతూ..

Hyderabad: అమెరికాలోని బోస్టన్‌ సైట్‌ బోర్డు సభ్యుడిగా రామం ఆత్మకూరి

  • కిమ్స్‌ డాక్టర్‌ శరత్‌ చంద్రమౌళికి రాయల్‌ ఫెలోషిప్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌గా సేవలందించిన రామం ఆత్మకూరి బోస్టన్‌ సైట్‌ బోర్డు సభ్యుడిగా బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా బోస్టన్‌ సైట్‌ సీఈఓ సారా యోస్ట్‌ మాట్లాడుతూ.. బోర్డు సభ్యుడిగా ఆయన వ్యూహాత్మక నాయకత్వం, సేవలు తమ సంస్థకు దోహదపడతాయని అన్నారు. వైద్యరంగం పరిశోధనలు, ఆవిష్కరణలతో విస్తరిస్తున్న సమయంలో ఆయన అనుభవం తమకు ఎంతో అమూల్యమైనద ని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామం ఆత్మకూరి మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలకు చిహ్నంగానే ఈ గౌరవం దక్కిందని భావిస్తున్నానని అన్నారు.


కాగా, కిమ్స్‌ ఆస్పత్రిలో రుమటాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్‌ వీరవల్లి శరత్‌ చంద్రమౌళికి లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌(ఆర్‌సీపీ) నుంచి ఫెలోషిప్‌ లభించింది. వైద్యరంగంలో చేసిన అసాధారణ సేవలు, సాధించిన విజయాలకు గుర్తింపుగా అందిన అదిపెద్ద గౌరవమని వైద్యులు తెలిపారు. ఆయనకు రుమటాలజీ, క్లినికల్‌ ఇమ్యునాలజీలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని చెప్పారు. డా.శరత్‌ చంద్రమౌళి మాట్లాడుతూ తనకు లభించిన గౌరవంతో ప్రజారోగ్యం కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.

Updated Date - Jun 26 , 2025 | 03:39 AM