Share News

Bhatti Vikramarka: రాజీవ్‌ యువ వికాసానికి సహకరించండి

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:26 AM

రాజీవ్‌ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవన ప్రమాణాలు పెరిగి వారి జీవితాలు మారుతాయని.. రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్‌ చేంజర్‌గా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: రాజీవ్‌ యువ వికాసానికి సహకరించండి

  • బ్యాంకర్లను కోరిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవన ప్రమాణాలు పెరిగి వారి జీవితాలు మారుతాయని.. రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్‌ చేంజర్‌గా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఈ పథకం అమలుపై బ్యాంకర్లతో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ పూర్తికావడంతో వెంటనే భట్టి బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.


ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాన్ని ఒక సాధారణ సంక్షేమ పథకంగా చూడవద్దని బ్యాంకర్లను కోరారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ఇంకా మిగిలిపోయిన నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఏడాదిలో రూ.6 వేల కోట్లు ఖర్చు పెడుతుందని.. బ్యాంకర్లు రూ.1,600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలని భట్టి కోరారు.

Updated Date - Apr 17 , 2025 | 04:26 AM