R Krishnaiah: ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాం
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:05 AM
రాష్ట్రంలో 56 శాతం బీసీ జనాభా ఉందని, వీరికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.

భవిష్యత్ కార్యాచరణపై 3న సదస్సు: ఆర్.కృష్ణయ్య
రాంనగర్, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 56 శాతం బీసీ జనాభా ఉందని, వీరికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. అయితే చట్టపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టంలోని లొసుగుల సాకుతో రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న బీసీ కులగణన వంటి అంశాలపై భవిష్యత్ కార్యాచరణకు ఆగస్టు 3న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు కులాల వారీగా జనాభా లెక్కలు పక్కాగా చేయాలని ప్రధాని మోదీని కోరారు. ఆ లెక్కల ద్వారా జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు అందే అవకాశం ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 డీ6, టీ6 ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. ఆగస్టు 3న జరిగే సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ కుల సంఘాలను ఆహ్వానిస్తున్నామని, వారి అభిప్రాయం ప్రకారం భవిష్యత్ ఆలోచన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటే ష్, జిల్లపల్లి అంజి, సతీష్, సుధాకర్, రాందేవ్, పృథ్వీరాజ్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News