R. Krishnaiah: బీసీ రిజర్వేషన్లపై జీవో జారీకి అభ్యంతరమేంటి..
ABN , Publish Date - Jun 18 , 2025 | 07:51 AM
బీసీలకు విద్య, ఉద్యోగ స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం జీవో జారీ చేయడానికి ఉన్న అభ్యంతరాలేమిటో స్పష్టం చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

- రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలకు విద్య, ఉద్యోగ స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం జీవో జారీ చేయడానికి ఉన్న అభ్యంతరాలేమిటో స్పష్టం చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాకతప్పదని ఆయన హెచ్చరించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్(Basheerbagh Press Club)లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు.
బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో కలిసి ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులు, బీసీ సంఘాలు, అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు వేముల రామకృష్ణ, జిల్లపల్లి అంజి, జి.అనంతయ్య, పగిల్ల సతీష్, రాందేవ్‌మోదీ, బాలయ్య, శివకుమార్, మణికంఠ, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇంజనీరింగ్‌లో మళ్లీ ‘నచ్చిన సబ్జెక్టులు’!
సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి
Read Latest Telangana News and National News