Share News

R. Krishnaiah: ఆర్‌.కృష్ణయ్య హెచ్చరిక.. ప్రజాభవన్‌ను హాస్టళ్లుగా మారుస్తాం

ABN , Publish Date - Apr 15 , 2025 | 10:29 AM

రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, బీసీల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించకపోతే ప్రజా భవన్‌ను హాస్టళ్లుగా మారుస్తామంటూ ఆయన అన్నారు.

R. Krishnaiah: ఆర్‌.కృష్ణయ్య హెచ్చరిక.. ప్రజాభవన్‌ను హాస్టళ్లుగా మారుస్తాం

- సొంత భవనాలను నిర్మించకపోతే.. ప్రజాభవన్‌ను హాస్టళ్లుగా మారుస్తాం

- రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరిక

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, బీసీల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించకపోతే ప్రజా భవన్‌ను హాస్టళ్లుగా మారుస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు. సోమవారం మూసారాంబాగ్‌లో తెలంగాణ సోషలిస్ట్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహే్‌షకుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి నివాళులర్పించారు.

ఈ వార్తను కూడా చదవండి: Radio: ‘ఆకాశవాణి’.. ఒక మధురానుభూతి


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద విద్యార్థులు చదువుకోడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ, బీసీ హాస్టళ్లలో ఒక్క సొంతభవనం కూడా లేదని, ఇందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఒకవైపు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఉండేందుకు భవనాలు నిర్మిస్తారు కానీ, హాస్టళ్లకు సొంత భవనాలు ఎందుకు నిర్మించడం లేదని ఆయన ప్రశ్నించారు.


city6.2.jpg

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాభవన్‌ను హాస్టళ్లుగా మార్చేందుకు విద్యార్థులందరినీ తరలి వచ్చేలా పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీల వెంకటేష్‌, తెలంగాణ సోషలిస్ట్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈర్ల ప్రసాద్‌, ప్రధానకార్యదర్శి గ్యార సతీష్‌, గ్రేటర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎలమండ్ల ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నీవు లేక నేనుండలేను..

ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!

తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

పిల్లలకు వాహనమిస్తే జైలుకే!

అందువల్లే అంత ఆసక్తి !

Read Latest Telangana News and National News

Updated Date - Apr 15 , 2025 | 10:29 AM