Pushpak Buses: పుష్పక్ బస్సు చార్జీల్లో రూ. 50-100 తగ్గింపు
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:54 AM
పుష్పక్ బస్సుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్న చార్జీల్లో రూ.50 తగ్గిస్తున్నట్లు శుక్రవారం గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి జూబ్లీబస్ స్టేషన్‌కు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రూ.450 చార్జీలు వసూలు చేస్తుండగా దాన్ని రూ.400గా నిర్ణయించారు.

హైదరాబాద్ సిటీ: పుష్పక్ బస్సుల్లో(Pushpak Buses) రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్న చార్జీల్లో రూ.50 తగ్గిస్తున్నట్లు శుక్రవారం గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్(Greater RTC ED Rajasekhar) ఓ ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి జూబ్లీబస్ స్టేషన్(Airport to Jubilee Bus Station)కు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రూ.450 చార్జీలు వసూలు చేస్తుండగా దాన్ని రూ.400గా నిర్ణయించారు. మరికొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ నడుపుతున్న పుష్పక్ బస్సుల్లో రూ. 50-100 చార్జీలు తగ్గించారు.
తగ్గించిన చార్జీలు ఇలా..
రూట్ పాతధర కొత్త ధర
ఎయిర్‌పోర్ట్ - శంషాబాద్ 200 100
ఎయిర్‌పోర్ట్- ఆరాంఘర్ 250 200
ఎయిర్‌పోర్ట్- మెహిదీపట్నం 350 300
ఎయిర్‌పోర్ట్ - పహాడీషరీఫ్ 200 100
ఎయిర్‌పోర్ట్ - బాలాపూర్ 250 200
ఎయిర్‌పోర్ట్ - ఎల్‌బీనగర్ 350 300
రాత్రి 10 తర్వాత పుష్పక్ బస్సుల్లో చార్జీలు
రూట్ పాతధర కొత్తధర
ఎయిర్‌పోర్ట్-జూబ్లీబ్‌సస్టేషన్ 450 400
ఎయిర్‌పోర్ట్-జేఎన్‌టీయూ, మియాపూర్ 450 400
ఎయిర్‌పోర్ట్ - లింగంపల్లి 450 400
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!
Read Latest Telangana News and National News