Uppal Cricket Stadium: ఉప్పల్ స్టేడియానికి ‘దారి’ వచ్చింది!
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:46 AM
ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి దారి తిరిగొచ్చింది. మైదానం గేట్లను మూసివేస్తూ ప్రహరీ నిర్మించడంపై ‘ఉప్పల్ స్టేడియానికి దారేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కదిలివచ్చాయి.

ఆంధ్రజ్యోతి కథనంతో స్పందన
అక్రమ ప్రహరీని కూల్చివేసిన అధికారులు
ఉప్పల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి దారి తిరిగొచ్చింది. మైదానం గేట్లను మూసివేస్తూ ప్రహరీ నిర్మించడంపై ‘ఉప్పల్ స్టేడియానికి దారేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కదిలివచ్చాయి. దీనితో స్పందించిన టీఎ్‌సఐఐసీ అధికారులు సదరు ప్రహరీని కూల్చివేశారు. ఉప్పల్ స్టేడియం పక్కనే ఖాళీగా ఉన్న 19.34 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన బిల్డ్ బ్రిక్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే స్టేడియం గేట్లకు అడ్డంగా ప్రహరీ నిర్మించింది. దీనిపై కథనం రావడంతో బుధవారం ఉదయం మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్, పలు బీసీ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీనితో టీఎ్‌సఐఐసీ బుధవారం ఆ ప్రహరీని కూల్చివేసింది. స్టేడియం పక్కనే ఉన్న ఈ ఖాళీ స్థలం ఇంకా టీఎ్‌సఐఐసీ ఆధీనంలోనే ఉందని, అనుమతి లేకుండా నిర్మించిన ప్రహరీని కూల్చామని టీఎ్‌సఐఐసీ ఉప్పల్ కమిషనర్ ప్రభాకర్ వెల్లడించారు.
పరిశ్రమ స్థలం.. రెసిడెన్షియల్ కోసం?
స్టేడియం పక్కనే 19.37 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉంది. పెంగ్విన్ టెక్స్‌టైల్స్‌కు చెందిన ఈ స్థలాన్ని బిల్డ్ బ్రిక్ సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. పారిశ్రామికంగా మాత్రమే వినియోగించాల్సిన ఈ స్థలాన్ని గ్రిడ్ పాలసీ కింద వాణిజ్య, నివాస అవసరాలకు వాడుకునేలా ‘స్థల వినియోగ మార్పిడి కోసం 2022లో దరఖాస్తు చేసుకుంది. దీనిపై టీఎ్‌సఐఐసీ అప్పట్లో ప్రభుత్వానికి లేఖ రాయగా అనుమతులు వచ్చాయి. తర్వాత ఈ స్థలం అభివృద్ధికి సంబంధించి టీఎ్‌సఐఐసీకి, బిల్డ్ బ్రిక్ సంస్థకు మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. తాజాగా స్టేడియం గేట్లను మూస్తూ ప్రహరీ నిర్మించేదాకా టీఎ్‌సఐఐసీ పట్టించుకోకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి