Academic Tribute: ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి కన్నుమూత
ABN , Publish Date - Jul 23 , 2025 | 07:01 AM
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, పొలిటికల్ సైన్స్..

కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల నివాళి
బర్కత్‌పుర/హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కుంభం మధుసూదన్‌రెడ్డి(90) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు నారాయణగూడలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య విమలారెడ్డి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మధుసూదన్‌రెడ్డి మరణ వార్త తెలియగానే విశ్రాంత న్యాయమూర్తులు, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీల నేతలు, ప్రొఫెసర్లు, వర్సిటీల వైస్ చాన్స్‌లర్లు ఆయన నివాసానికి వచ్చి నివాళులర్పించారు. మధుసూదన్‌రెడ్డి 1935లో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో జన్మించారు. నగరానికి వచ్చి నారాయణగూడలో స్థిరపడ్డారు. ఆయన ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మధుసూదన్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయి. మధుసూదన్‌రెడ్డి మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి