Share News

Harish Rao: రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజల ఆర్తనాదాలు..!

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:52 AM

తెలంగాణలో ఇంతవరకు సాగునీళ్లకోసం రైతన్నలు గోస పడితే, ఇప్పుడు తాగునీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు.

Harish Rao: రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజల ఆర్తనాదాలు..!

  • రేవంత్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలి: హరీశ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇంతవరకు సాగునీళ్లకోసం రైతన్నలు గోస పడితే, ఇప్పుడు తాగునీటి కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. మిషన్‌ భగీరథ నిర్వహణలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యం కనబడుతోందని, నల్లాల ద్వారా నీటిసరఫరా చేయని దైన్య స్థితి నెలకొందని బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్లను ఒడిసిపట్టకపోవడం, చెరువులు నింపకపోవడంతో భూగర్భ జలాలు అట్టడుగుకు చేరుతున్నాయని, ముందు చూపులేని కాంగ్రెస్‌ పాలనలో పొలాలు తడారి ప్రజల బతుకులు ఎడారయి పోతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి తాగు నీళ్లిస్తే, రేవంత్‌ కనీసం ఆ పథకాన్ని కొనసాగించడం లేదని, ఉమ్మడి పాలన నాటి బిందెలు, డ్రమ్ములు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆరోపించారు.


ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాల ప్రవాహాన్ని పారించడం మానేసి, ప్రజల ఇళ్లకు తాగునీటిని అందించాలని సూచించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేతకానితనం వల్లే ఏపీ అక్రమంగా కృష్ణా జలాలను తరలించుకుపోయిందని, ఈ జల దోపిడీని అడ్డుకోలేని దద్దమ్మలుగా రాష్ట్ర సీఎం, మంత్రులు మిగిలిపోయారని మాజీమంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణాజలాలను ఏపీ అక్రమంగా తరలిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎప్పటి నుంచో చెబుతోందని.. తాము చెప్పిన విషయం నిజమని కేఆర్‌ఎంబీ రుజువు చేసిందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..

Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

Updated Date - Apr 17 , 2025 | 03:52 AM