Factory Accident Worker Tragedy: ‘సిగాచి’ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:40 AM
పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది.

మొదటి విడతలో 15 కుటుంబాలకు అందజేత
సిగాచి పరిశ్రమ సీఈవో, ఎండీ అమిత్‌రాజ్ సిన్హా
పటాన్‌చెరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది. బుధవారం తొలి విడతలో 15 కుటుంబాలకు రాష్ట్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సమక్షంలో నగదును బదిలీ చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన 46 మంది కార్మికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పరిశ్రమ సీఈవో, ఎండీ అమిత్‌రాజ్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.
మిగతా మృతుల కుటుంబాలకు కూడా దశలవారీగా మధ్యంతర పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన మరో 8 మంది కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం అందజేస్తామని తెలిపారు. మొదటి విడతలో మొత్తం రూ.5.80 కోట్ల మధ్యంతర పరిహారం అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి పరిహారాన్ని త్వరలోనే అందిస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News