Share News

Mandda Krishna Madiga: మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కిన గౌరవం

ABN , Publish Date - Jun 20 , 2025 | 08:34 AM

పద్మశ్రీ అవార్డును తాను అందుకున్నప్పటికీ అది యావత్‌ మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కినదిగా తాను భావిస్తానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు.

Mandda Krishna Madiga: మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కిన గౌరవం

- పద్మశ్రీ అవార్డుపై మంద కృష్ణమాదిగ

హైదరాబాద్: పద్మశ్రీ అవార్డును తాను అందుకున్నప్పటికీ అది యావత్‌ మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కినదిగా తాను భావిస్తానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ(Mandda Krishna Madiga) అన్నారు. పద్మశ్రీని అందుకోవడాన్ని హర్షిస్తూ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌ సెంటర్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం మంద కృష్ణమాదిగకు సన్మాన సభను నిర్వహించారు.


city4.2.jpg

వీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంద కృష్ణమాదిగతో పాటు ఆయన సతీమణి జ్యోతిని ఘనంగా సన్మానించారు. అనంతరం మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ 1994లో ఒక కులం కోసం ప్రారంభమైన తన పోరాట ప్రస్థానం అణగారిన అన్ని వర్గాల కోసమూ సాగిందని వివరించారు. ఈ పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు.


ఈ కార్యక్రమంలో ముసాయిదా కమిటీ, వీహెచ్‌పీఎస్‌ జాతీయ కోర్‌ కమిటీ చైర్మన్‌ ఎల్‌.గోపాల్‌రావు, కో చైర్మన్‌ అందె రాంబాబు, జాతీయ కమిటీ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, మహిళా అధ్యక్షురాలు ఎస్‌.భవానీ చౌదరి, వీహెచ్‌పీఎస్‌ ఏపీ అధ్యక్షుడు అన్యం చిన్న సుబ్బయ్య యాదవ్‌, ఎమ్మార్పీఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌మాదిగ, ప్రధానకార్యదర్శి ఉపేందర్‌ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

పాడు బుద్ధి.. పోయే కాలం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 20 , 2025 | 08:34 AM