Share News

School Vehicles: ఇలా కుక్కి తీసుకెళితే ఎలా?

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:06 AM

నలుగురు వెళ్లాల్సిన ఆటోలో 8 నుంచి 10 మంది.. 8 మందిని తీసుకెళ్లాల్సిన మారుతీ ఓమ్ని వ్యాన్‌లో 15 నుంచి 18 మంది..

School Vehicles: ఇలా కుక్కి తీసుకెళితే ఎలా?

  • ఆటోలు, స్కూల్‌ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్ధుల తరలింపు

  • నామమాత్రంగా రవాణా శాఖ తనిఖీలు

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నలుగురు వెళ్లాల్సిన ఆటోలో 8 నుంచి 10 మంది.. 8 మందిని తీసుకెళ్లాల్సిన మారుతీ ఓమ్ని వ్యాన్‌లో 15 నుంచి 18 మంది.. మినీ బస్సుల్లో అయితే 30 నుంచి 40 మంది.. విద్యార్థులను కుక్కి మరీ తీసుకెళుతున్నారు. ఆ పిల్లల బ్యాగులు, లంచ్‌బాక్సులు అదనం. ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా కనిపిస్తున్న తంతు. పొద్దున బడులకు వెళ్లేప్పుడు, ఇళ్లకు వచ్చేప్పుడు చిన్నారులకు ఈ ప్రమాదకర ప్రయాణం తప్పడం లేదు. ఏదైనా కారణంతో అనుకోని ప్రమాదం జరిగితే ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


ఇలా ప్రైవేటు వాహనాలు, ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తున్నా రవాణాశాఖ నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ‘విద్యార్థులను తరలించే వాహనాలపై నిరంతర తనిఖీలు కొనసాగుతుంటాయి. అధికారులు, సిబ్బంది కొరత కారణంగా నిత్యం, ప్రతి చోటా తనిఖీచేసే వెసులుబాటు ఉండదు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యతగా వ్యవహరిస్తే ఈ సమస్యను అరికట్టవచ్చు’ అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 05:06 AM