Share News

Srushti Fertility Center Twist : సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో క్షుద్ర పూజల కలకలం..

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:49 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ భవనంలో క్షుద్ర పూజలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Srushti Fertility Center Twist : సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో క్షుద్ర పూజల కలకలం..
Srushti Fertility Center

విశాఖ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ భవనంలో క్షుద్ర పూజలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిర్మాణ దశలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ భవనంలో క్షుద్ర పూజలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను నిర్మాణ దశలో ఉన్న ఓ భవనంలో 5,6 ఫ్లోర్లలో కొనసాగిస్తున్నారు.


అయితే.. అదే భవనం మొదటి అంతస్తులో హోమం జరిగినట్లు ఆధారాలు గుర్తించారు పోలీసులు. క్షుద్రపూజలు ఎవరూ చేశారనే కోణంలో విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. మొదటి అంతస్తులు పూజలు ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? సృష్టి సిబ్బంది చేశారా..? అనే సందేహాలు అధికారులను రేకెత్తిస్తున్నాయి.


కాగా, ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Srushti Fertility Center) కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆమెను గోపాలపురం పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు నమ్రతను విచారించనున్నారు. ప్రస్తుతం నమ్రత హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలో ఖైదీగా ఉన్నారు. ఆమెను జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు. నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్‌తో పాటు పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్‌గా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో(Srushti Fertility Center) సరోగసి మాటున శివశివుల విక్రయాలు జరిపినట్లు నిర్దారణ కావడంతో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

20 మంది దాటితే రెండో టీచర్‌

రాజమండ్రి జైలుపై డ్రోన్‌.. టెన్త్‌ విద్యార్థిపై కేసు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 01 , 2025 | 05:32 PM