Share News

Cases Against Nellore YCP Leaders : జగన్ పర్యటన.. కేసులు నమోదు

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:56 AM

మాజీ సీఎం జగన్ ఎక్కడ పర్యటన వెళ్లినా.. ఆ పర్యటన ఓ వివాదంగా మారుతోంది. తాజాగా ఆయన నిన్న చేసిన నెల్లూరు పర్యటనలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారంటూ.. పలువురి వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Cases Against Nellore YCP Leaders : జగన్ పర్యటన.. కేసులు నమోదు
Police Case On Prasanna kumar Reddy

నెల్లూరు : మాజీ సీఎం జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్లినా.. ఆ పర్యటన ఓ వివాదంగా మారుతోంది. తాజాగా ఆయన నిన్న చేసిన నెల్లూరు పర్యటనలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారంటూ.. పలువురి వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్‌లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.


జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల నిబంధనలు అతిక్రమించి రోడ్లపై బైఠాయించడం, బారికేడ్లు తోసేయడంతో దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. అయితే.. తాము పోలీసుల అంక్షల ప్రకారమే నడుచున్నామని వైసీపీ నేతలు అంటున్నారు.


అయితే పలు కేసుల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో వైఎస్ జగన్ గురువారం ములాఖత్ అయ్యారు. జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడైన ప్రసన్నకుమార్ రెడ్డిని జగన్ పరామర్శించారు. జగన్ పర్యటన సందర్భంగా భారీగా జనసమీకరణ చేశారు వైసీపీ నేతలు. జనసమీకరణ కోసం రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జన సమీకరణ కోసం లిక్కర్, క్వార్ట్జ్ స్కాముల ద్వారా సంపాదించిన డబ్బునే వారు వినియోగించారని నెల్లూరులో టాక్ నడుస్తోంది.


ఇవి కూడా చదవండి..

20 మంది దాటితే రెండో టీచర్‌

రాజమండ్రి జైలుపై డ్రోన్‌.. టెన్త్‌ విద్యార్థిపై కేసు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 01 , 2025 | 11:49 AM