NVS Reddy: మెట్రోరైల్ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్ రెడ్డి
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:20 AM
హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఇదివరకు పనిచేసిన ఆయా స్థానాల్లోనే మరో ఏడాది కాలానికి తిరిగి ఆయనను నియమిస్తూ జీవో నంబర్82ను ప్రభుత్వం జారీ చేసింది.

ఏడాది కాలానికి పునర్నియామకం
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఇదివరకు పనిచేసిన ఆయా స్థానాల్లోనే మరో ఏడాది కాలానికి తిరిగి ఆయనను నియమిస్తూ జీవో నంబర్82ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి ఏడాదిపాటు ఆయన పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-2, ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టుల క్లిష్టమైన ప్రణాళిక, డాక్యుమెంటేషన్ దశలో ఉన్నందున ఎన్వీఎస్ రెడ్డి సేవలు అవసరమని భావించి ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు ఆదేశాల్లో వివరించారు. మెట్రో రెండో దశలో రెండు భాగాలుగా ప్రాజెక్టు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో మరో 8 మందిని కూడా తిరిగి నియమించుకునే అవకాశం ఉందని మెట్రో వర్గాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో మెట్రో రెండో దశ మొదటి భాగం, డీపీఆర్ రూపకల్పన రెండో భాగం ఉండడంతో ఇప్పటి వరకు పనిచేసిన అధికారుల అవసరం ఉన్న నేపథ్యంలోనే కొందరు అధికారులను మరో ఏడాదికాలానికి నియమించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న 6,729 మందిని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇలా తొలగించిన వారిలో అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఉన్నారు. ఈ జాబితాలో మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒకరు. అయితే ఇలా తొలగించిన వారిలో ఎవరి సేవలైనా అవసరం అని భావిస్తే వారి పునర్నియమానికి నోటిఫికేషన్, ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్వీఎ్‌సరెడ్డిని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
For More AP News and Telugu News