Share News

New ration cards: పంపిణీకి సిద్ధంగా కొత్త రేషన్‌కార్డులు..

ABN , Publish Date - Jul 29 , 2025 | 09:20 AM

కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, నియోజకవర్గాలలో సుమారు 80వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.

New ration cards: పంపిణీకి సిద్ధంగా కొత్త రేషన్‌కార్డులు..

- చివరిదశకు చేరుకున్న దరఖాస్తుల పరిశీలన

- ఇప్పటికే అర్హుల జాబితా సిద్ధం

- త్వరలోనే కార్డులు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

హైదరాబాద్: కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌(Medchal, Malkajgiri, Uppal, Kukatpally, Quthbullapur) నియోజకవర్గాలలో సుమారు 80వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో దరఖాస్తులు పరిశీలించిన అధికారులు అర్హులైన వారిని గుర్తించారు. అనర్హులుగా తేలినవారి దరఖాస్తులను ఇప్పటికే తిరస్కరించారు.


మరికొన్ని చోట్ల పరిశీలన ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీనవర్గాలకు చెందిన ఎంతో మంది ఏళ్లుగా నూతన రేషన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం పదేళ్ల కాలంలోనూ రేషన్‌కార్డుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఇప్పుడు నూతన కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.


బాలానగర్‌లో 7,200 మంది అర్హులు..

రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ఆగస్టు 10లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో సివిల్‌ సప్లై అధికారులు దానికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాలానగర్‌ ఏఎస్ఓ కార్యాలయం పరిధిలో 28,660 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 14,460 దరఖాస్తులను అధికారులను పరిశీలించారు. 7,200 మంది రేషన్‌ కార్డులకు అర్హులుగా గుర్తించారు. 3,860 దరఖాస్తులను తిరస్కరించగా, మరో 3,400 రేషన్‌ కార్డులు పరిశీలిస్తున్నారు. అర్హులకు త్వరలోనే రేషన్‌ కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.


అర్హులను గుర్తించాం

బాలానగర్‌ ఏఎ్‌సవో పరిఽధిలో త్వరలోనే నూతన రేషన్‌ కార్డులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అర్హులను గుర్తించాం. దరఖాస్తు దారులకు ఏమైనా సందేహలు ఉంటే నేరుగా కార్యాలయంలో సంప్రదించాలి. దళారులను ఆశ్రయించి మోసపోవద్దు.

- కల్యాణ్‌, బాలానగర్‌ ఏఎస్‏వో


అధికారులకు కృతజ్ఙతలు

రేషన్‌కార్డు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదరుచూస్తున్నాం. ఇప్పటికే చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నాం. అయితే ఇప్పుడు లబ్ధిదారుల లిస్ట్‌లో మా పేరు రావడం పట్ల చాలా ఆనందంగా ఉంది. నిజమైన అర్హులను గుర్తించి ఎంపిక చేస్తున్న అధికారులకు కృతజ్ఙతలు తెలుపుతున్నాం.

- చీర్ల మంగమ్మ, మూసాపేట


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు

ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 29 , 2025 | 09:24 AM