Share News

సాగర్‌, శ్రీరాంసాగర్‌ పరిశీలనకు ఎన్‌డీఎస్‌ఏ

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:45 AM

శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులను పరిశీలించడానికి జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) సమ్మతి తెలిపింది.

సాగర్‌, శ్రీరాంసాగర్‌ పరిశీలనకు ఎన్‌డీఎస్‌ఏ

  • సమ్మతి తెలిపిన చైౖర్మన్‌ అనిల్‌జైన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులను పరిశీలించడానికి జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) సమ్మతి తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించడానికి వస్తున్న ఎన్‌డీఎ్‌సఏ చైౖర్మన్‌ అనిల్‌జైన్‌ను సాగర్‌, శ్రీరాంసాగర్‌లు కూడా పరిశీలించేలా విజ్ఙప్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎన్‌డీఎ్‌సఏకు తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌ కుమార్‌ లేఖ రాశారు. సాగర్‌, శ్రీరాంసాగర్‌లను పరిశీలించడానికి వీలుగా అదనంగా ఒక రోజు కేటాయిస్తామని, షెడ్యూల్‌ను ఖరారు చేసి, సమాచారం ఇవ్వాలని ఎన్‌డీఎ్‌సఏ కార్యాలయం తెలంగాణకు బదులిచ్చింది. ఇదివరకు ఉన్న షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 28న విజయవాడకు చేరుకొని, ఏపీలో డ్యామ్‌ సేఫ్టీ అధికారులతో ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో అనిల్‌జైన్‌ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఈనెల 29న శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలించనున్నారు. 30న హైదరాబాద్‌లో తెలంగాణ అధికారులతో సమావేశం జరగాల్సి ఉండగా... దీన్ని మార్చనున్నారు. 30న నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌లను పరిశీలించాక... మే 1న హైదరాబాద్‌లో స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ అధికారులతో సమావేశం అయ్యేలా షెడ్యూల్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.


శ్రీరాంసాగర్‌ గేట్లన్నీ జల్లెడ పట్టండి : మంత్రి ఉత్తమ్‌

తుంగభద్ర డ్యామ్‌ గేటు దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో 50ఏళ్లు నిండిన ప్రాజెక్టుల గేట్లను పరిశీలించాలని ప్రముఖ ఇంజనీర్‌ కన్నయ్యనాయుడు సూచనతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. 1963లో నిర్మించిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్ల మన్నికపై సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు నిర్దేశించారు. ఈ మేరకు ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌కు మంత్రి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ గేటును నిశితంగా పరిశీలించి, లోపాలుంటే కొత్త గేట్లు పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

Updated Date - Apr 22 , 2025 | 04:45 AM