Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Apr 28 , 2025 | 09:29 AM
Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్-1 బాయిలర్‌లో ఆయిల్ ఫైర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

నల్గొండ, ఏప్రిల్ 28: జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో (Yadadri Thermal Power Plant) అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యూనిట్-1 బాయిలర్‌లో ఆయిల్ ఫైర్ కావడంతో మంటలు చెలరేగాయి. అయితే మంటలను సకాలంలో అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్లాంట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వచ్చే నెలలో (మే నెల) యూనిట్ - 1ను ప్రారంభించేందుకు అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు.
యూనిట్ - 1 బాయిలర్‌కు ఆయిల్ సప్లై చేసే పైప్ లీక్ అయ్యింది. అదే సమయంలో కింద వెల్డింగ్ పనులు చేస్తుండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తరువాత యూనిట్ మొత్తానికి మంటలు వ్యాపించాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు దూరంగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదం నేపథ్యంలో 600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా.. ట్రాయల్ రన్ చేసేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు సహజమే అని థర్మల్ పవన్ ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. గత డిసెంబర్‌లో యూనిట్-2ను కూడా ఇప్పటికే తెలంగాణ మంత్రులు జాతికి అంకితం చేశారు. ఇప్పుడు తాజాగా వచ్చే నెలలో యూనిట్ - 1లో విద్యుత్ ఉత్పత్తిని చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు విశ్లేషించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
India Pakistan Ceasefire: మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భారత్
సహజంగా ట్రయల్ రన్ నిర్వహించేటప్పుడు బాయిలర్‌కు సప్లై చేసే పైపు ద్వారా ఆయిల్ లీకేజ్ కావడం సహజమే అనేది అధికారులు మాట. కానీ ట్రయల్ రన్ నిర్వహించే క్రమంలోనే ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల ఉన్నతాధికారులు విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రమాదం ఎందుకు జరిగింది.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి.. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కాగా.. రెండు నెలల క్రితం (ఫిబ్రవరి 14న) కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. ప్లాంట్‌లోని రెండో యూనిట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న సమయంలో ఈఎస్‌పీ వద్ద యాష్ జామ్ అవడంతో బాయిలర్ నిలిచిపోయింది. దీంతో యాష్‌ను తొలగిస్తుండగా... వేడి బూడిద కార్మికులపై పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఇవి కూడా చదవండి
Shubman Gill On Dating Rumours: డేటింగ్ వదంతులపై ఎట్టకేలకు స్పందించిన శుభమన్ గిల్
China: యూనివర్సిటీ డిగ్రీ ఉన్నా వీధిలో ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం.. ఎందుకని అడిగితే..
Read Latest Telangana News And Telugu News