Vemula Veeresham: ఘనంగా వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలు..
ABN , Publish Date - Jun 01 , 2025 | 07:36 PM
నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరేశం జన్మదినోత్సవాన్ని సంబరంగా చేసుకున్నారు.

నల్లగొండ, జూన్ 1: నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరేశం జన్మదినోత్సవాన్ని సంబరంగా చేసుకున్నారు. వీరేశం అనుచరులు, అభిమానులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కేకులు కట్ చేసి, బాణాసంచా కాల్చారు. పలువురు రక్తదానం చేశారు. మరికొందరు అనాథ పిల్లలకు పండ్లు, అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఏపీ లింగోటం గ్రామంలో ఎమ్మెల్యే వీరేశం ప్రధాన అనుచరుడైన గడ్డం పశుపతి ఆధ్వర్యంలో బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరంతా భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేసి.. వీరేశానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ ప్రజలందరి సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పశుపతి.. ప్రజల నాయకుడైన ఎమ్మెల్యే వీరేశానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండే నాయకుడు వీరేశం అని.. ఆయన మరో వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
సీఎంను కలిసిన వేముల వీరేశం..
తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వచ్చిన వీరేశం.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వీరేశానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుద చేశారు.