Share News

Jaggareddy: సీఎం రేవంత్ రెడ్డిని తిడితే నా రక్తం ఉడుకుతోంది

ABN , Publish Date - Jul 19 , 2025 | 09:28 PM

సీఎం రేవంత్ రెడ్డిని తిడితే తన రక్తం ఉడుకుతోందన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పాలనపై మీటింగ్ పెట్టేందుకు సిద్ధమాని జగ్గన్న.. కేటీఆర్ ను సవాల్ చేశారు.

Jaggareddy:  సీఎం రేవంత్ రెడ్డిని తిడితే నా రక్తం ఉడుకుతోంది
Jaggareddy

హైదరాబాద్, జులై 19: సీఎం రేవంత్ రెడ్డిని తిడితే తన రక్తం ఉడుకుతోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగ్గారెడ్డి బీఆర్ఎస్ పైనా, కేటీఆర్ మీదా హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పాలనపై సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వేల్ లో మీటింగ్ పెట్టేందుకు సిద్ధమాని జగ్గన్న.. కేటీఆర్ ను సవాల్ చేశారు. చర్చకు మీ ఫ్యామిలీ రెడీ అయితే, మా కాంగ్రెస్ ఫ్యామిలీ రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. మీటింగ్ ఖర్చు రేవంత్ రెడ్డి భరిస్తారని చెప్పారు. 'సీఎం రేవంత్ రెడ్డిని నేను ఒప్పిస్తాను. బీఆర్ఎస్ నేతలు చర్చకు వస్తారా? ఏ శాఖపై చర్చ చేద్దామో చెప్తే ఆ మంత్రిని చర్చకు ఒప్పిస్తాను. ఎమ్మెల్యే అయ్యాక కూడా నేను దొడ్డు బియ్యమే తిన్నాను. కేసీఆర్ పాలన 'ఆహా నా పెళ్ళంట' సినిమాలో కోట శ్రీనివాస్ తిన్న కోడి లాగా ఉండేది. చదువు అంటే భవిష్యత్తు కాబట్టే మా ప్రభుత్వం పిల్లల చదువుపై ఖర్చు చేస్తున్నాం. కేటీఆర్ ను చూస్తే జాలిగా ఉంది.' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.


మహిళలను మీటింగుకు పిలిచి ఉచిత బస్సు వల్ల ఉపయోగముందా లేదా అని అడుగుదామని జగ్గారెడ్డి కేటీఆర్ ని సవాల్ చేశారు. బీఆర్ఎస్ నాయకులను శరీరమంతా భూమిలో పాతి పెట్టి పాములు వదిలే పనిష్మెంట్ ఇవ్వాలని జగ్గారెడ్డి అన్నారు. 'ఏం తప్పు చేశామని సీఎం రేవంత్ ను, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు? ఉచిత బస్సు వల్ల మహిళలకు ఉపయోగం జరిగిందా లేదా అని సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గంలో అడుగుదామా? తెలంగాణ ప్రజలు రాహుల్ నాయకత్వంపై, కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో మాకు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతోంది. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడానికి అనేక కారణాలున్నాయి. లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి కేసీఆర్ ఐదేండ్లు చేసారు. ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసారు. పేదలకు ఇండ్లు ఇస్తామని పిట్ట కథలు చెప్పి ఇవ్వలేదు. మల్లన్న సాగర్ రైతుల వీపులు పగలకొట్టారు. పదేండ్లు భయంకర, దుర్మార్గ, నికృష్ట పాలన కొనసాగింది. గొంతు విప్పితే గొంతు నొక్కే నీచమైన పరిపాలన కేసీఆర్ చేసారు. దుర్మార్గపు పాలన చేసారు కాబట్టే ప్రజలు, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టారు. నలుగురు మంత్రులను ఒప్పిస్తాను సిరిసిల్లాలో మహిళలతో మీటింగ్ పెట్టుకుందాం కేటీఆర్ సిద్ధమా? ఒకటో తారీఖున జీతాలు, పెన్షన్లు ఇస్తున్నాం. 23 వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశాం. ప్రతి క్వింటాల్ కి 500 రూపాయల బోనస్ ఇచ్చాం.' అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


కేటీఆర్ సంగతేందో చూద్దాం జగ్గన్న అని రేవంత్ అంటే నేను టెంప్ట్ కాకుండా ఉండగలనా? అని చెప్పిన జగ్గారెడ్డి.. 'నేను, రేవంత్ అటాకింగ్ లనే అటాకింగ్ చేసి వచ్చిన వాళ్ళం. అనవసరంగా రేవంత్ ను రెచ్చగొట్టకు. రేవంత్ మూడ్ పాడైతే కేటీఆర్ ఇంట్లో నుండి బయటకి రాలేడు. తోపులంతా మా దగ్గర ఉన్నారు. మగాడివైతే రా అని కేటీఆర్ అన్నాడు.. ఆ డైలాగ్ కేటీఆర్ కి సెట్ కాదు. సీరియస్ డైలాగ్స్ కేటీఆర్ కి సెట్ కావు. కేటీఆర్ వాడింది మా డైలాగ్. రేవంత్ రెడ్డిని మగాడివైతే రా అని అనగలరా? రేవంత్ సీరియస్ గా తీసుకొని వస్తే కేటీఆర్ గుండెకు నిద్ర పడుతదా? కేటీఆర్ సంగతేందో చూద్దామని రేవంత్ సెక్యూరిటీని పక్కన పెడితే కేటీఆర్ పరిస్థితి ఏంటి? రేవంత్ వస్తే తట్టుకునే గట్స్ కేటీఆర్ కి ఉన్నాయా? మేం అపోజిషన్లో ఉన్నప్పుడే పోలీసులను అదరగొట్టాం. రేవంత్ ను అరెస్ట్ చేసేందుకు నీ చెంచాలను రేవంత్ బెడ్ రూం లోకి పంపినప్పుడు.. తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డికి వస్తే అడ్డుకుంటానని కేసీఆర్ కు సవాలు చేశా. 12 గంటల పాటు కేసీఆర్ నా బార్డర్ దాటలేకపోయారు.' అని జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.


ఇవీ చదవండి:

జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్

22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Jul 19 , 2025 | 09:36 PM