ఎర్రవల్లిలో కబ్రిస్తాన్‌ను నిర్మించండి
ABN , Publish Date - Mar 01 , 2025 | 03:58 AM
శ్మశాన వాటిక(కబ్రిస్తాన్)కు స్థలం కేటాయించాలని మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లికి చెందిన ముస్లింలు ఆర్డీవో కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు.

మృతదేహంతో ఆర్డీవో ఆఫీసు ముందు ఆందోళన
గజ్వేల్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): శ్మశాన వాటిక(కబ్రిస్తాన్)కు స్థలం కేటాయించాలని మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లికి చెందిన ముస్లింలు ఆర్డీవో కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన నజియా మృతి చెందడంతో దహన సంస్కారాలు ఎక్కడ చేయాలో తెలియక పలువురు శుక్రవారం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. గతంలో తమ గ్రామాలను ఖాళీ చేయించిన సమయంలో అధికారులు అనేక హామీలు ఇచ్చారని.. నాలుగేళ్లుగా కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. సమస్యలను పరిష్కరించడం లేదని వాపోయారు. ఎర్రవల్లిలో కబ్రిస్తాన్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.