MP R. Krishnaiah: గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచండి..
ABN , Publish Date - Jul 15 , 2025 | 09:36 AM
బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్ సంక్షేమ భవన్ ముందు పలువురు గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు.

- ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్ సంక్షేమ భవన్ ముందు పలువురు గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాలలకు అదనంగా 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాత గురుకులలో వసతి సౌకర్యం ఉన్నచోట 5 నుంచి 8వ తరగతులలో అదనపు సెక్షన్‌లను ప్రారంభించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ గురుకుల సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి.అంజి, బి. వెంకట్, అరవింద్‌స్వామి, శివ, కౌషిక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెండింగ్ ఫీజు బకాయిలు రూ.6వేల కోట్లు విడుదల చేయాలని కోరుతూ సీఎస్ రామకృష్ణరావుకు కృష్ణయ్య వినతి ప్రతం అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య
Read Latest Telangana News and National News