R. Krishnaiah: ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:38 AM
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గు చేట ని ఎంపీ ఆర్.కృష్ణయ్య.. సీఎం రేవంత్ రెడ్డి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌పై ఎంపీ ఆర్. కృష్ణయ్య ధ్వజం
న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గు చేట ని ఎంపీ ఆర్.కృష్ణయ్య.. సీఎం రేవంత్ రెడ్డి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అగౌరవపరిచేలా ఉన్నాయన్నారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని బీసీ కాదనడానికి రేవంత్‌రెడ్డి ఏమన్నా రెవెన్యూ ఇన్‌స్పెక్టరా? తహశీల్దారా? అని ప్రశ్నించారు. బీజేపీని బీసీ వ్యతిరేక పార్టీగా రేవంత్ రెడ్డి విమర్శించడం తగదని హితవు పలికారు.
బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదేనని, కేంద్ర మంత్రివర్గంలో 27మంది బీసీలకు చోటు కల్పించిందన్నారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం చేతకాక కాంగ్రెస్ పనికిమాలిన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీప్రకారం స్థానిక సంస్థ ల రిజర్వేషన్లు రాష్ట్రప్రభుత్వ పరిధిలోనివని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు స్థాని క సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలుచేయాలని డిమాండ్ చేశారు.