Minister Seethakka: గద్దెలు మార్చకుండానే ఆధునికీకరణ
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:02 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల గద్దెల మార్పు ..

హైదరాబాద్, ములుగు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల గద్దెల మార్పు లేకుండానే ఆలయ పరిసరాల ఆధునికీకరణ పనులు చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. పూజారుల కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, జాతరకు వచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆధునికతతో పాటు ఆదివాసి సంప్రదాయాలను గౌరవించేలా ప్రణాళిక సిద్థం చేస్తామన్నారు. అన్ని మార్గాల్లో ఆదివాసీ పోరాట యోధుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News